Published On:

Tollywood Heroines: స్టార్ హీరోలతో సినిమాలు.. ఈ ఇద్దరు భామలకు హిట్ దక్కేనా.. ?

Tollywood Heroines: స్టార్ హీరోలతో సినిమాలు.. ఈ ఇద్దరు భామలకు హిట్ దక్కేనా.. ?

ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ సక్సెస్ ఉన్నవారినే ప్రజలు గుర్తిస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే సక్సెస్ అనేది చాలా ముఖ్యం. వరుసగా రెండు సినిమాలు హిట్ అయ్యాయి అంటే ఆ హీరోయిన్ ను గోల్డెన్ లెగ్ అని కొనియాడేస్తారు. అదే ఒక్క ప్లాప్ వచ్చింది అంటే ఐరన్ లెగ్ అని కూలదోస్తారు. అందుకే గ్లామర్ ప్రపంచంలో ఎక్కువ కాలం ఉండరు.

 

ఇకపోతే ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లు తమ లక్ ను పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొదట గోల్డెన్ లెగ్ అనిపించుకున్న ఈ ఇద్దరు ఆ తరువాత ఐరన్ లెగ్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారే టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి.

 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానే పూజా హెగ్డే లాస్ట్ హిట్. ఆ సినిమా తరువాత పూజా.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో దాదాపు పది లోపు సినిమాలు చేసి ఉంటుంది. అన్ని పరాజయాలను అందుకోవడంతో అమ్మడిని ఐరన్ లెగ్ కింద ముద్ర వేశారు. దీంతో పూజా ఒక ఏడాది మొత్తం వెకేషన్ అంటూ గ్యాప్ తీసుకొని ఫ్రెష్ గా రెట్రో సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది.

 

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పూజా.. సూర్య సరసన నటిస్తోంది. ఈ సినిమాపైనే అమ్మడు ఆశలన్నీ పెట్టుకుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రమోషన్స్ లో కూడా అమ్మడు ఒక్కత్తే కనిపిస్తుంది. ఆ కట్టు, బొట్టు.. రెట్రో ఫీల్ ను తీసుకొచ్చి అంచనాలను ఇంకా పెంచుతుంది. ఈ సినిమ కనుక హిట్ అయితే మళ్లీ పూజ ఫామ్ లోకి వస్తుంది.

 

ఇక రెండో హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సినిమాతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత శ్రీనిధి రేంజ్ మారిపోతుంది అనుకున్నారు అంతా.. కానీ, అదేమి జరగలేదు. ఆ సినిమా తరువాత శ్రీనిధి చేసిన సినిమాలు ఏవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక చాలా కాలం తరువాత ఈ చిన్నది తెలుసు కదా అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది..సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా శ్రీనిధి నటిస్తోంది. ఈ సినిమా ఫంక్షన్ లోనే శ్రీనిధిని చూసిన నాని.. హిట్ 3 సినిమా కోసం తీసుకున్నాడట.

 

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హిట్ 3. ఇప్పటికే ఈ సినిమా హిట్ అవుతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. శ్రీనిధి ఆశలు కూడా ఈ సినిమా మీదనే ఉన్నాయి. మే 1 న హిట్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ రెండు సినిమాలతో ఈ ఇద్దరు హీరోయిన్లు హిట్ ను అందుకుంటారా.. ? లేదా? అనేది చూడాలి.