Published On:

IPL 2025 : ఆప‌ద్భాంద‌వులు క్లాసెన్, అభినవ్.. ముంబయి టార్గెట్ 144

IPL 2025 : ఆప‌ద్భాంద‌వులు క్లాసెన్, అభినవ్.. ముంబయి టార్గెట్ 144

IPL 2025 : హైదరాబాద్ స‌న్‌రైజ‌ర్స్ సొంతగడ్డపై త‌డ‌బ‌డి.. చివర్లలో పోరాడ‌గ‌లిగే మంచి స్కోర్ చేసింది. ముంబయి ఇండియ‌న్స్ బౌలర్ల ధాటికి టాపార్డ‌ర్ మ‌రోసారి కుప్పకూలింది. 35 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయిన.. ఎస్ఆర్‌హెచ్‌ను హెన్రిచ్ క్లాసెన్ (71) ఆదుకున్నాడు. ఒత్తిడిలోనూ ఖ‌త‌ర్నాక్ అర్ధసెంచరీ పూర్తిచేసిన అతడు ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ అభిన‌వ్ మ‌నోహ‌ర్ (43)తో మంచి భాగస్వామ్యం నెల‌కొల్పాడు. క్రీజులో పాతుకుపోయిన ఇద్ద‌రు ముంబయి బౌలర్ల‌పై విరుచుకుపడుతూ విరోచిత ఇన్నింగ్స్ ఆడి 5 వికెట్‌కు 99 పరుగులు చేశారు. దాంతో 100 లోపే కుప్ప‌కూలేలా కనిపించిన‌ హైదరాబాద్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు చేయ‌గ‌లిగింది.

 

క్లాసెన్ ఒంట‌రి పోరాటం..
ఓవైపు వికెట్లు ప‌డుతున్నా క్లాసెన్ ఒంట‌రి పోరాటం చేశాడు. ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన అభిన‌వ్ మ‌నోహ‌ర్ (43) ఓపిక‌గా క్రీజులో నిల‌బ‌డి క్లాసెన్‌కు మంచి స‌హ‌కారం అందించాడు. 10 ఓవ‌ర్ల తర్వాత క్లాసెన్ రెచ్చిపోయి బౌండ‌రీతో హాఫ్ సెంచరీ చేశాడు. త‌ర్వాత కూడా బుమ్రా బౌలింగ్‌లో అభిన‌వ్ ఫోర్ కొట్టి హైదరాబాద్ స్కోర్ 100 దాటింది. పాండ్యా వేసిన 18వ ఓవ‌ర్లో మ‌నోహ‌ర్ స్ట్రెయిట్‌గా సిక్స‌ర్ బాదాడు. 5 వికెట్‌కు 99 ప‌రుగుల విలువైన భాగ‌స్వామ్యం నెల‌కొల్పి ప‌రువు కాపాడారు. బుమ్రా బౌలింగ్‌లో సిక్స‌ర్ బాదిన క్లాసెన్ త‌ర్వాత బంతికే ఔట‌య్యాడు. బౌల్ట్ వేసిన ఆఖ‌రి ఓవ‌ర్లో మ‌నోహ‌ర్, క‌మిన్స్ బౌల్డ్ కావడంతో హైదరాబాద్ స‌న్‌రైజ‌ర్స్ ఏడు వికెట్ల న‌ష్టానికి 142 ర‌న్స్ చేయ‌గ‌లిగింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో బౌల్ట్ నాలుగు, దీపక్ 2 వికెట్లు తీశారు. బుమ్రా, హార్దిక్ పాండ్య చెరో వికెట్ పడగొట్టారు.

 

 

ఇవి కూడా చదవండి: