Nidhhi Agerwal: వీరమల్లు రాణిగారు.. చీరకట్టులో భలే ఉన్నారు

అందాల భామ నిధి అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సవ్యసాచి సినిమాతో నిధి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ తో అమ్మడు మొదటి హిట్ ను అందుకుంది.

స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసినా కూడా నిధికి పెద్ద హిట్స్ పడలేదు అనే చెప్పాలి.

తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా అమ్మడు స్టార్ హీరోలతో కలిసి నటించింది. అక్కడ కూడా పరాజయమే దక్కింది.

ప్రస్తుతం తెలుగులో నిధి.. హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ సినిమాల్లో నటిస్తోంది.

ఇక సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా అమ్మడు యమా వ్యక్తిగా ఉంటుంది. తాజాగా పింక్ కలర్ చీరలో అద్భుతంగా కనిపించింది.

ప్రస్తుతం నిధి చీర ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.