Published On:

Pawan Kalyan: ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ సినిమా తరువాత పవన్ ను చూడడం కష్టమేనా ..?

Pawan Kalyan: ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ సినిమా తరువాత పవన్ ను చూడడం కష్టమేనా ..?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇంకోపక్క ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలను ఎలా అయినా ఫినిష్ చేయాలని చూస్తున్నా కూడా టైమ్ మాత్రం దొరకడం లేదు. ఇప్పటికే ఆయన నటించిన హరిహర వీరమల్లు వాయిదాల మీద వాయిదాలు నడుస్తుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న క్లారిటీ పాపం మేకర్స్ కూడా లేనట్లు ఉంది.

 

ఇక దీని సంగతి పక్కన పెడితే.. పవన్ నటిస్తున్న మరో చిత్రం OG. కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సగానికి పైగా షూటింగ్ ను ఫినిష్ చేసుకున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని సెట్ అయితే.. సెప్టెంబర్ లో OG రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రెండు కాకుండా పవన్ చేతిలో ఉన్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 

ఎన్ని ప్లాపులు వచ్చినా హరీష్ శంకర్.. ధైర్యంగా నిలబడడానికి కారణం ఈ సినిమానే. ఎలాగైనా పవన్ తో గబ్బర్ సింగ్ లాంటి హిట్ అందుకోవాలని ఎంతో కసిగా ఉన్నాడు. ఇలా మూడు సినిమాలు పోటాపోటీగా ఉన్నాయి. పవన్ మాత్రం రాజకీయం , సేవలు అంటూ తిరుగుతున్నాడు. అందులో వెన్ను నొప్పి కూడా తోడవడంతో హాస్పిటల్స్ అని, రెస్ట్ అని దీనికే టైమ్ అయిపోతుంది. పవన్ ఇంత డిలే చేస్తున్నా కూడా మేకర్స్ ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. ఆయన ఎప్పుడు ఒక చెప్తే అప్పుడే షూట్ చేస్తామని చెప్పుకొచ్చారు.

 

ఇక వారు ఇచ్చిన గౌరవాన్ని పవన్ కూడా నిలబెట్టుకున్నాడు. తాజాగా పవన్, నిర్మాతలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అందరి సినిమాలను ఫినిష్ చేస్తామని మాట ఇచ్చినట్లు సమాచారం. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తరువాత పవన్ సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది అభిమానులకు బ్యాడ్ న్యూస్ అవ్వొచ్చు కానీ, ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసమే.. పవన్ ఈ సినిమాలను ఫినిష్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఒక్కసారి అవన్నీ ఫినిష్ అయితే.. పూర్తిగా రాజకీయలకే అనికితమవ్వనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజమున్నది తెలియాల్సి ఉంది.