Published On:

Rameswaram Pamban Bridge: రామేశ్వరంలో 2.5 కి.మీల పంబన్ వంతెన.. ఇవాళే ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Rameswaram Pamban Bridge: రామేశ్వరంలో 2.5 కి.మీల పంబన్ వంతెన.. ఇవాళే ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi To Inaugurate India’s First Vertical Lift Sea Bridge: తమిళనాడులోని రామేశ్వరంలో కేంద్ర ప్రభుత్వం పంబన్ బ్రిడ్జిని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా వర్టికల్ లిఫ్ట్ విధానంలో బ్రిడ్జి మధ్యలో భారీ షిప్‌లు వెళ్లేలా స్టెయిన్ లెస్ స్టీల్‌తో అద్భుతంగా నిర్మించింది. ఈ పంబన్ బ్రిడ్జిని కేంద్రం రూ.550కోట్లతో దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించింది. ఈ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది.

 

ఈ మేరకు శ్రీరామనవమి సందర్భంగా మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ పంబన్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. పంబన్ నుంచి రిమోట్ సిస్టమ్‌లో బ్రిడ్జి వర్టికల్ లిఫ్ట్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రామేశ్వరం నుంచి తాంబరానికి స్పెషల్ రైలు నడవనుంది. అలాగే, రూ.8,300 కోట్లతో చేపట్టనున్న నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రామేశ్వర ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించుకొని పూజలు చేయనున్నారు.

 

ఈ పంబన్ బ్రిడ్జి విషయానికొస్తే..దేశంలోనే మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. ఈ బ్రిడ్జిని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించగా.. తుప్పు పట్టకుండా బ్రిడ్జికి స్పెషల్ కెమికల్‌తో కోటింగ్ చేశారు. అలాగే బ్రిడ్జిని రూ.550 కోట్లతో నిర్మించగా.. 2.08 కి.మీ పొడవు, 99 స్పాన్లు, 72.5 మీటర్ల నిలువు లిఫ్ట్ స్పాన్‌తో దాదాపు ప్రస్తుతం ఉన్న ఎత్తు నుంచి 17 మీటర్ల వరకు పైకి వెళ్తుంది. దీనిని స్టెయిన్ లెస్ స్టీల్ రీన్ ఫోర్స్‌మెంట్, హై గ్రేడ్ ప్రొటెక్టివ్ కలర్, వెల్డింగ్ జాయింట్‌లతో నిర్మించారు.

 

అంతకేకాకుండా భవిష్యత్తులో డ్యూయల్ రైలు ట్రాక్‌కు అవకాశం ఉండేలా అత్యంత మన్నికతో పా టు తక్కువ నిర్వహణ కలిగేలా నిర్మించారు. ఈ బ్రిడ్జ్ చరిత్రలో అద్భుతంగా నిలిచిపోనుంది. ఇక, రామసేతు నిర్మాణం రామేశ్వరంలో ఉన్న ధనుష్ కోటి నుంచి ప్రారంభమైనట్లు రామాయణంలో పేర్కొన్నారు.