Published On:

Glycerin For Skin: ఈ ఒక్కటి ముఖానికి వాడితే కొరియన్ గ్లాస్ స్కిన్ !

Glycerin For Skin: ఈ ఒక్కటి ముఖానికి వాడితే కొరియన్ గ్లాస్ స్కిన్ !

Glycerin For Skin: కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం కొన్ని రకాల హోం రెమెడీస్ వాడవచ్చు. ఇవి చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి. కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం గ్లిజరిన్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది.

గ్లిజరిన్  ముఖానికి ఎక్కువ సార్లు వాడటం వల్ల కొరియన్ గ్లాస్ స్కిన్ పొందవచ్చు. గ్లిజరిన్ హ్యూమెక్టెంట్‌గా పనిచేస్తుంది. ఇది ముఖాన్ని మృదువుగా, అందంగా ఉంచడంలో సహాయపడుతుంది.

గ్లిజరిన్ చర్మం పొడిబారడం, దురద నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. గ్లిజరిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మంపై ఎరుపును తగ్గించడానికి ,చికాకును తొలగించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది తామర లేదా సోరియాసిస్‌ ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గ్లిజరిన్ ముడతలను నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనిని ముఖానికి తరచుగా వాడటం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

గ్లిజరిన్ , పాలతో క్లెన్సర్: ఈ రెండు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. దీని కోసం.. కొన్ని చుక్కల గ్లిజరిన్‌ను గోరువెచ్చని పచ్చి పాలలో కలిపి.. దూది సహాయంతో ముఖానికి అప్లై చేసి, ఆపై చేతులతో ముఖాన్ని మసాజ్ చేయండి.

గ్లిజరిన్, రోజ్ వాటర్ టోనర్: కొరియన్ గ్లాస్ స్కిన్ పొందడానికి.. డబుల్ క్లెన్సింగ్‌ చేయండి. తర్వాత మీ టోనర్ లేదా సీరంతో కొన్ని చుక్కల గ్లిజరిన్ కలపండి. తర్వాత ఎసెన్స్ అప్లై చేయండి. మరిన్ని ప్రయోజనాల కోసం.. మీ షీట్ మాస్క్ ఎసెన్స్‌లో గ్లిజరిన్ కలపండి.

చర్మాన్ని తేమగా మార్చడానికి గ్లిజరిన్ ఫేస్ మాస్క్: గ్లిజరిన్, రోజ్ వాటర్ , అలోవెరా జెల్ లను సమాన పరిమాణంలో తీసుకుని పేస్ట్ లాగా తయారు చేయండి. దీనిని 15-20 నిమిషాలు ముఖంపై ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

మొటిమలు ఉన్న వారికి గ్లిజరిన్ ఫేస్ మాస్క్: గ్లిజరిన్‌ను తేనెతో కలిపి మిక్స్ చేసి దీనికి కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను కలపండి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 10-15 ఉంచండి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగించండి.

మెరిసే చర్మానికి గ్లిజరిన్ ఫేస్ మాస్క్: గ్లిజరిన్‌ను కాస్త సాదా పెరుగు, ఒక టీస్పూన్ మెత్తగా రుబ్బిన ఓట్స్‌తో బాగా కలపండి. అనంతరం దీనిని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మృదువుగా చేసి.. ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా ఓట్స్ ఉపశమనం కలిగిస్తాయి. ఎక్కువ సార్లు ఈ ఫేస్ ప్యాక్ వాడితే ముఖం తెల్లగా మారుతుంది. ముఖంపై ఉన్న మొటిమలు కూడా చాలా వరకు తగ్గుతాయి.

రాత్రి చికిత్స కోసం గ్లిజరిన్, విటమిన్ E: మీరు రాత్రి పడుకునే ముందు కూడా వీటిని ముఖానికి ఉపయోగించవచ్చు. ఇందుకోసం గ్లిజరిన్‌లో 1 విటమిన్ E క్యాప్సూల్‌ను కట్ చేసి.. నూనెను తీసి, బాగా కలిపి, ఆపై అప్లై చేయండి. ఉదయం నిద్రలేచిన తర్వాత.. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.