Published On:

Indian Army attack on Pak Air Base: పాక్ మిలటరీ బేస్‌లే టార్గెట్‌గా భారత్ మిస్సైల్స్!

Indian Army attack on Pak Air Base: పాక్ మిలటరీ బేస్‌లే టార్గెట్‌గా భారత్ మిస్సైల్స్!

Indian Army attack on Pak Air Base: పాక్ మిలటరీ బేస్‌లను టార్గెట్‌గా భారత్ మిస్సైల్ దాడులు చేస్తుంది. ఇప్పటి వరకు ఓపిక పట్టిన భారత్ కు పాకిస్థాన్ పిచ్చి చేష్టలు అసహనం తెప్పించాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేయగా, పాక్ ఆర్మీ అందుకు జవాబు చెబుతోంది. ఉగ్రవాదులకు బదులుగా పాక్ ఆర్మీ స్పందించడంతో  పాకిస్థాన్ ను లష్కరే తీవ్రవాదులు నడినిస్తున్నారా అన్నా అనుమానాలు ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి.

 

ఉగ్రవాదుల అంతిమ సంస్కారాలకు పాకిస్థాన్ ఆర్మీ ఆదేశపు జాతీయ జెండా పార్థివ దేహాలపై కప్పి మరీ జరిపించారు. ఇదే విషయాన్ని భారత్ ప్రపంచదేశాలకు అందించింది. అప్పుడు సమాదానంగా మృతుల్లో ఆర్మీ ఆఫీసర్ కొడుకు ఉన్నాడని పాకిస్థాన్ చెప్పుకొచ్చింది. అయినా సాధారణ పౌరుల శవాలపై జాతీయ జెండాను కప్పడం జరుగదన్న నిజాన్ని పాకిస్థాన్ మర్చిపోయింది.

 

పాకిస్థాన్ అదే పనిగా భారత నగరాలపై బాంబులను కురిపిస్తుంది. ఒక రకంగా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్, హిందూ ఆలయాలను టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇది గనుక సక్సెస్ అయితే భారత్ లో మత కల్లోలాను సృష్టించాలని చూస్తోంది. అయితే…. పాకిస్థాన్ చేస్తున్న చిల్లర పనులకు భారత్ ఓపిక నశించింది. దీంతో పాక్ పై దాడిని తీవ్రం చేసింది భారత్ ఆర్మీ.

 

పాక్ నగరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. ఇస్లామాబాద్, లాహోర్‌లో భారీ పేలుళ్లు జరిగాయి. దీంతో పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేశారు. అలాగే రావల్పిండిలో నూర్‌ఖన్ ఎయిర్‌బేస్‌, రఫీకి, మురిద్, చక్వాల్‌పై బాలిస్టిక్ మిస్సైళ్లతో భారత్ దాడి చేసింది. దీంతో పాక్ భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడులు జరుపుతుంది. ఈ నేపథ్యంలో ఫతహ్ క్షిపణిని భారత్ కూల్చివేసింది.

 

పాకిస్థాన్ లో భూకంపం

ఇది పాకిస్థాన్ కాదని పాపిస్థాన్ అని నెటిజన్లు అంటున్నారు. అన్నట్లుగానే పాకిస్తాన్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇండియా చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్.. అటు BLA చేతిలో కూడా… నరకం అనుభవిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ దేశానికి మరో ఊహించని షాక్ తగిలింది.

 

కాసేపటి క్రితమే పాకిస్తాన్ దేశంలో భూకంపం వచ్చింది. జనాలంతా యుద్ధం భయంతో చస్తూ బతుకుతూ ఉంటే… తాజాగా భూకంపం రావడం కలకలం సృష్టించింది. రిక్టర్ స్కేల్ పైన 4.0 గా భూకంపం నమోదు అయింది. అయితే ఈ భూకంపం రావడంతో జనాలంతా ఇండ్లలో నుంచి బయటకు వచ్చి పరుగులు పెట్టారు. పాకిస్తాన్ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ భూకంపం వచ్చినట్లు సమాచారం అందుతోంది.

 

ఇవి కూడా చదవండి: