Ambati Rayudu: భారత్- పాక్ యుద్ధంపై పోస్ట్.. అంబటి రాయుడిపై నెటిజన్స్ ఫైర్

India- Pak War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ పై పాక్ దాడులకు పాల్పడింది. డ్రోన్స్, క్షిపణులతో అటాక్ చేస్తోంది. కాగా పాక్ మిస్సైల్స్, డ్రోన్స్ ను ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. సరిహద్దు వెంబడి పాక్ కాల్పులకు తెగబడుతోంది. వీటిని భారత జవాన్లు ధీటుగా తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో భారత సైనికులు భారతీయులు అండగా నిలుస్తున్నారు.
అయితే టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ఓ ట్వీట్ మాత్రం వివాదాస్పదంగా మారింది. పాక్ దాడులను ధీటుగా ఎదుర్కొంటున్న భారత్ పై కన్నుకు కన్ను తీసుకుంటే ప్రపంచమంతా గుడ్డిదవుతుంది’ అని రాయుడు ట్వీట్ చేయడం పెద్ద వివాదంగా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతుండగా.. ‘న్యాయం జరగాలి కానీ మానవత్వాన్ని మరిచిపోకూడదు. దేశాన్ని ప్రేమిస్తున్నప్పటికీ గుండెల్లో దయ ఉండాలి’ అని మరో ట్వీట్ చేయడంతో తీవ్ర దుమారం లేపింది. దీంతో అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై జాలి, దయ ఏమిటని ఫైర్ అవుతున్నారు.
నరరూప రాక్షసులపై జాలి, దయ ఎందుకని అంబటిని కామెంట్లతో ఆడుకుంటున్నారు. ఒరేయ్ అంబటి రాయుడు.. నువ్వు పాకిస్తాన్ వెళ్లిపో’ అని కొందరు.. ‘వీడిని జనసేన నుంచి తరిమేయండి పవన్ కల్యాణ్ గారు’ అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండటం రాయుడికి అలవాటేనని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.