Horoscope for Saturday May 10 2025: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ప్రమోషన్స్, బదిలీలు!

Horoscope for Saturday, May 10, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
మేషం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. బంధుమిత్రులతో వచ్చిన వివాదాలను పెద్దల సమక్షంలో పరిష్కారమవుతాయి. రాజకీయాల్లో కొంతవరకు అనుకూలంగా అవకాశాలు వస్తాయి. దైవ చింతన మరవద్దు
వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి స్వల్పంగా డబ్బు అందుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంనేందుకు ఇష్టపడుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రతిభకు తగిన ప్రతిఫలం వస్తుంది. వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలి.
మిథునం:
ఈ రాశి వారికి శుభప్రదం. వృత్తి, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి చెందుతారు. రాజకీయాల్లో మంచి పేరు వస్తుంది. ప్రభుత్వ అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ రాశి వారికి ప్రయాణాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:
ఈ రాశివారికి అనుకూలం. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇతరులతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. సంతానం కలుగుతుంది. చేయాల్సిన పనులను పట్టుదలతో చేసి విజయం సాధిస్తారు. దైవారాధన ఉండాలి.
సింహం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. పెండింగ్ రుణాలు తీరుతాయి. ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందు అడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి రెట్టింపు పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి పొందుతారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యంనపై శ్రద్ధ అవసరం.
కన్య:
ఈ రాశి వారికి అనుకూలం. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు, ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం వస్తుంది. ఇంట్లో శుభవార్త వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
తుల:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆలోచన విధానంలో కొంత మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త కార్యక్రమాలను చేపడుతారు. ఇతరులతో ఆచితూచి నడుచుకోవాలి.
వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఎదుగదలను చూసి అసూయ పడతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఆరోగ్యం బాగుటుంది. ఇంటి దేవుడిని పూజించాలి.
ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలం. పెట్టిన పెట్టుబడులకు డబుల్ ఆదాయం వస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఉంటుంది. కొంతమంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బదిలీలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో సమస్యలు వచ్చిన పరిష్కరించుకుంటారు. దైవచింతన ఉండాలి.
మకరం:
ఈ రాశి వారికి శుభప్రదం. కొత్త పరిచయాలు కలుగుతాయి. వ్యాపారులకు తగిన లాభాలు వస్తాయి. ఉద్యోగులకు బదీలు ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. లక్ష్మీదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది.
కుంభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు పనిచేస్తాయి. ఆర్థిక విషయాల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగడంతో మంచి లాభాలు ఉంటాయి. దైవచింతన అలవర్చుకోవాలి.
మీనం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆభరణాలు కొంటారు. పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. రాజకీయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా వృద్ధి చెందుతారు.
ఇవి కూడా చదవండి:
- Horoscope for Thursday, May 08, 2025: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అవసరానికి డబ్బు చేతికి అందుతుంది!