Published On:

India Pakistan War: ఆలయాలే టార్గెట్ గా పాకిస్థాన్ మిసైల్ దాడులు!

India Pakistan War: ఆలయాలే టార్గెట్ గా పాకిస్థాన్ మిసైల్ దాడులు!

Pakistan Missile Attack on Shambhu Temple in Jammu: ఆలయాలే టార్గెట్ గా పాకిస్థాన్ మిసైల్స్ ను ప్రయోగిస్తోంది. ఆలయాలు, గురుద్వారాలను టార్గెట్ చేసి భారత్ లో మత ఘర్షణలు సృష్టించాలని చూస్తోంది. అందులో భాగంగానే అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్, నార్త్ ఇండియాలోని టెంపుల్స్ ను టార్గెట్ చేసుకుంది.  జమ్మూలోని ప్రఖ్యాత శంభు ఆలయంపై మిస్సైల్ దాడి చేసింది. భారత్ సైన్యం అప్రమత్తమై. ఆలయం గేటు వద్దే గగనతలంలో మిస్సైల్‌ను భారత్ కూల్చివేసింది.

 

పాక్, భారత్ యుద్ధ వాతవరణ నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాల్లో పోలీసులు, ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. తిరుమలలో డిజిపి హరీష్ గుప్తా ఆదేశాలతో తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచనలతో అక్తోపస్ బలగాలు, విజిలెన్స్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు ఏదైనా వాహనంపై అనుమానం వస్తే తనిఖీలు చేయడం జరిగుతోందని తిరుమల డి.ఎస్.పి విజయ్ కుమార్ తెలిపారు.

 

ఇండియా- పాకిస్థాన్ మధ్య గురువారం నుంచి పూర్తి స్థాయి యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. ఇక పాకిస్థాన్ నుంచి వస్తున్న మిస్సైల్స్‌ను డ్రోన్‌లను ఇండియా ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం ఎస్‌ -400 ఆకాశ్‌ అని భారత వైమానికదళానికి చెంది మాజీ అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజామున 1 గంట నుంచి 1.30 నిమిషాల వరకు పాకిస్థాన్ నుంచి వరదలా వచ్చిన మిస్సైల్స్‌ను, డ్రోన్లను ఇండియా ఎయిర్‌ డిపెన్స్‌ సిస్టమ్‌ ధీటుగా ఎదుర్కొంది. పాక్‌ నుంచి వస్తున్న డ్రోన్‌లను ట్రాక్‌ చేసింది.

 

పాక్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా భారత్ దాడి చేసింది. ఎయిర్ టు సర్ ప్రైజ్ మిస్సైల్స్ తో 5 నగరాలపై ఇండియా విరుచుకుపడింది. లాహోర్, ఇస్తామాబాద్, రావల్పిండిపై అటాక్ చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై మిసైల్ దాడి చేసింది. మూడు ఎయిర్ బేస్ లపై దాడి జరిగినట్టు పాకిస్థాన్ ప్రకటించింది. రావల్పిండిలో వరుసగా మూడు చోట్ల భారత్ దాడికి దిగింది. దీంతో పాకిస్థాన్ అన్ని విమానాలను రద్దు చేసింది.