Home / Telangana Govt
Telangana Govt. Hiked Hari Hara Veeramallu Ticket Price: హరిహర వీరమల్లు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 23వ తేదీన నిర్వహించబోయే ప్రీమియర్ షో కోసం ఒక్కో టికెట్‌ను 600 వరకు విక్రయించుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాక, సినిమా విడుదలైన 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు పది రోజుల పాటు సాధారణ థియేటర్లలోనూ, మల్టీప్లెక్స్ థియేటర్లలోనూ టికెట్ […]
Lal Darwaja Simha Vahini Mahankali Bonalu: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలను సమర్పించడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. దీంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుండటంతో అమ్మవారి దర్శనానికి […]
Emergency Number : డయల్ 100 ఎంతో ఫేమస్. ఆపదలో ఉన్నామని ఒక్క కాల్ చేస్తే చాలు.. పోలీసులు కుయ్ కుయ్ మంటూ వాహనాల్లో వచ్చేస్తారు. ఎలాంటి ప్రమాదం నుంచి అయినా రక్షిస్తారనే నమ్మకం బాధితుల్లో ఉంది. అర్ధరాత్రి ఆడపిల్ల నడిరోడ్డుపై ఒంటరిగా నడస్తోందంటే అందుకు కారణం డయల్ 100 నంబర్. ఆ నంబర్ అంతటి ధీమా కల్పించింది. ఇక్కడో చిన్న ఇబ్బంది కూడా ఉంది. అగ్నిప్రమాదం జరిగితే కూడా డయల్ 100కు కాల్ చేస్తుంటారు. మెడికల్ […]
Adluri Lakshman takes charge as Minister: అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఏడాదికి 500 మందికి అవకాశం కల్పించనున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై షెడ్యూల్డ్ కులాలు, గిరిజన అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ తొలి సంతకం చేశారు. సచివాలయంలో 2వ అంతస్తులోని తన చాంబర్లో మంత్రిగా శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తెలంగాణ వ్యాప్తంగా 844 మంది దివ్యాంగులకు రూ.5 కోట్లతో స్వయం ఉపాధి […]
Gaddar Film Awards 2025: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం నేడు(శనివారం) హైటెక్స్‌లో వైభవంగా జరగనుంది. కొన్నేళ్లుగా సర్కారు నుంచి తెలుగు సినిమా అవార్డుల కార్యక్రమం జరగలేదు. దీంతో కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు, 2024 ఏడాదికి అన్ని విభాగాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో […]
IAS Officers : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను సర్కారు బదిలీ చేసింది. గురువారం సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 33 మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్‌గా దాసరి హరిచందన, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ ఎండీగా జె.శంకరయ్య, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా శశాంక్ గోయెల్, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా […]
Telangana Govt : తెలంగాణ సర్కారు పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సేవా పతకాలను ప్రకటిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో పనిచేసే గ్రేహౌండ్స్‌కు చెందిన 9 మందికి శౌర్య పతకం దక్కింది. 16 మంది మహోన్నత సేవా పతకం, 92 మంది ఉత్తమ సేవా పతకం, 47 మంది కఠిన సేవా పతకం, 461 మంది సేవా పతకం అందుకోనున్నారు. […]
Telangana CS Ramakrishna Rao Strong Warning to IAS Officers for Political Issue: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పర్యటనలో భాగంగా నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సీఎంకు పలువురు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అయితే ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లను ఐఏఎస్ అధికారి శరత్ మొక్కారు. కాగా, సీఎం రేవంత్ హడావిడిగా ఉండడంతో సరిగ్గా చూడలేదు. కానీ, దీనికి సంబంధించిన వీడియో […]
Layout Regularization Scheme (LRS) : లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 3వ తేదీతో ముగిసిన గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్ టైమ్ సెటిల్మెంట్ను ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ఆర్ఎస్పై రాయితీ గడువును మొదట మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 30 వరకు, ఆ తర్వాత […]
Ration cards are a trap for Mistakes : కుటుంబంలోని యజమాని తన పిల్లల పేర్లను రేషన్‌కార్డుల్లో జత చేసేందుకు మీ సేవ కేంద్రాలు, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. పిల్లల పేర్లు తన సొంత ఊరిలో కాకుండా అత్తగారి ఊరిలో, అత్తగారి రేషన్ కార్డులో నమోదు అయ్యాయి. భార్యాభర్తలు ఇద్దరు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా, భర్తకు తన సొంత ఊరిలో, భార్యకు అమ్మగారి ఊరిలో రేషన్ కార్డు వచ్చింది. మరో యజమాని తన […]