Published On:

Results: నర్సింగ్ పోస్టులకు పరీక్ష రాశారా.. రిజల్ట్స్ వచ్చాయ్

Results: నర్సింగ్ పోస్టులకు పరీక్ష రాశారా.. రిజల్ట్స్ వచ్చాయ్

Telangana: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇవాళ ఫలితాలను వెల్లడించింది. https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

అయితే రాష్ట్రంలో ఖాళీగా 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం కొంత కాలం క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 42,244 మంది అప్లై చేసుకున్నారు. వీరిలో 40,423 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే ఫలితాలలో ప్రస్తుతం అభ్యర్థుల మార్కులను మాత్రమే రిలీజ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. త్వరలోనే అభ్యర్థుల ర్యాంకులు, కేటగిరీల వారిగా మెరిట్ లిస్ట్ పెడతామని చెప్పారు. అయితే పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదల కావడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.