Home /Author M Rama Swamy
Russia : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. సుమీ నగరంపై జరిపిన క్షిపణుల దాడిలో 21 మంది మృతి చెందగా, 80 మంది గాయపడ్డారు. స్థానిక తాత్కాలిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ వివరాలను వెల్లడించారు. మట్టల ఆదివారం పండుగ సందర్భంగా స్థానికులు ఒకేచోటకు చేరగా, రెండు క్షిపణి దాడులు జరిగాయని తెలిపారు. పండుగ సందర్భంగా మహా విషాదం చోటుచేసుకుందని సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు అగ్రరాజ్యం అమెరికా […]
Murder in Uttar Pradesh : ల్యాండ్‌కు సంబంధించిన డబ్బు వివాదంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. సదరు మహిళకు మద్య తాగించి తర్వాత గొంతుకోసి మృతదేహాన్ని యుమునా నదిలో పడేశారు. ఈ ఘటన యూపీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో అంజలి (28) జీవనం కొనసాగిస్తోంది. తన భర్త మృతిచెందడంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వద్ద ఉంటోంది. కాగా, అంజలి రియల్ ఎస్టేట్ వ్యాపారి శివేంద్ర […]
Former Delhi CM Atishi : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా భర్త మనీశ్ గుప్తాపై ఆప్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. మనీశ్ గుప్తా అనధికారికంగా ఢిల్లీ సర్కారును నడుపుతున్నారని ఆరోపించారు. మనీశ్ గుప్తా పలువురు అధికారులతో సమావేశమైన ఫొటోను అతిశీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్త మనీశ్ గుప్తా పలువురు అధికారులతో సమావేశమయ్యారని తెలిపారు. గ్రామాల్లో సర్పంచ్‌గా మహిళ ఎన్నికైతే […]
Bandi Sanjay : రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నం బియ్యం తామే ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ చేపట్టిన గావ్ చలో కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ ఆదివారం ఉదయం కరీంనగర్ మండలంలోని జూబ్లినగర్‌లో పర్యటించారు. గ్రామంలో తిరుగుతూ కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర పథకాల అమలు, గ్రామ సమస్యలపై ఆరా తీశారు. అంతకుముందు లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు. మోదీ ప్రభుత్వం […]
Bhu Bharati : ఎన్నికల్లో ధరణి పోర్టర్‌ను బంగాళఖాతంలో వేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. ధరణితో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను దోచుకుని అమ్ముకుందని ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తీసేసి భూ భారతిని అమలు చేస్తామని చెప్పింది. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ భారతిని ప్రవేశపెట్టింది. తెలంగాణలో రేపే భూ భారతి పోర్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష.. భూ భారతిని […]
Minister Nara Lokesh : మంగళగిరిలో ఏడాదిలో 3 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంగళగిరి పేదలకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 […]
AP, Telangana Temperatures : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. 10 రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. దీంతో గొడుగులు పట్టుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంతోపాటు పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి […]
awan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ సింగపూర్‌లో ఓ పాఠశాలలో జరిగిన ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందగా, మార్క్ శంకర్‌ను వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ భార్యతో కలిసి సింగపూర్ వెళ్లిన పవన్… శనివారం రాత్రి పవన్ తన భార్య అన్నాలెజినోవా, కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. తన […]
Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కారు నిర్లక్ష్యంతో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయ్యాయని, అయినా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశతో టన్నెల్ వద్ద కుటుంబ సభ్యులు రోధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 8 మంది ప్రాణాలను ప్రశ్నార్థకం చేసిందన్నారు. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. […]
IPL 2025 27th Match- SRH Vs PKBS: హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 23 బంతుల్లో 42 పరుగులతో చెలరేగాడు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 36 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. నేహల్ వధేరా 27 పరుగులు చేసి రాణించాడు. చివర్లలో మార్కస్ స్టాయినిస్ 11 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్స్‌లతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు. […]