Obulapuram mining case : గాలి జనార్దన్‌రెడ్డికి శిక్ష.. సబితాఇంద్రారెడ్డికి క్లీన్ చిట్.. ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

Obulapuram mining case Anantapur : ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసులో ఏ-1గా ఉన్న బీవీ శ్రీనివాస్‌రెడ్డి, ఏ-2 గాలి జనార్దన్‌రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని నిర్దోషిగా తేల్చింది. సబితతోపాటు ఏ-8 కృపానందాన్ని నిర్దోషిగా ప్రకటించింది. కేసులో శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఏ-3 వీడీ రాజగోపాల్, ఏ-4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ-7 అలీ ఖాన్‌కు నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు బీవీ శ్రీనివాస్‌రెడ్డి, గాలికి కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసు సంచలనం సృష్టించింది. కేసు సంబంధించి మంగళవారం సీబీఐ నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఐదుగురు నిందితులను ఇప్పటికే దోషులుగా తేల్చుతూ శిక్షలు ఖరారు చేసింది. ఏ-1 శ్రీనివాస్‌రెడ్డి, ఏ-2 మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి ఏడేళ్లు శిక్షను కోర్టు ఖరారు చేసింది. కేసులో ఇద్దరు నిందితులుగా ఉన్న మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఐఏఎస్ కృపానందాన్ని నిర్దోషిగా ప్రకటించింది. 14 ఏళ్ల పాటు విచారించిన తర్వాత నాలుగు చార్జిషీట్లను సీబీఐ కోర్టు ముందు సీబీఐ అధికారులు సమర్పించారు. 14 ఏళ్లపాటు విచారణ అనంతరం సీబీఐ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఏ-1, ఏ-2 నిందితులకు ఏడేళ్లపాటు శిక్ష విధించింది.
కేసులో ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471తో పాటు మరికొంత మందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి) కింద సీబీఐ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. కేసులో చాలా మంది సాక్షులను విచారించారు. సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం సీబీఐ విచారణలో అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మంగళవారం సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది.