BreakingNews: యాదాద్రి పవర్ ప్లాంటులో అగ్నిప్రమాదం

నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి పవర్ ప్రాజెక్టులో యూనిట్ -1లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. బాయిలర్‌నుంచి ఆయిల్ లీకేజీ అయ్యి మంటలు చెలరేగటంతో యూనిట్ వన్ పాక్షికంగా దెబ్బతిన్నది.
వచ్చే నెలలో యూనిట్ – 1ను ప్రారంభించేందుకు ట్రైలర్ రన్ నిర్వహిస్తుండగా.. బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. దీంతో పెద్దఎత్తున మంటలను చెలరేగాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్లాంట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రయల్ రన్ చేసే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం సహజమే అని అధికారులు తెలిపారు.