Published On:

explosion in company: యాదాద్రి జిల్లాలో పేలుళ్లు.. ఇద్దరు మృతి

explosion in company: యాదాద్రి జిల్లాలో పేలుళ్లు.. ఇద్దరు మృతి

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ పేలుళ్లు కలకలం రేపాయి. మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో ఇవాళ పేలుడు జరిగింది. ప్రమాదంలో 9 మంది కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మరణించగా.. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

 

పేలుడు ధాటికి భవనం పూర్తిగా నేలమట్టమైంది. కాగా ప్రమాదానికి గురైన వారిని పోలీసులు గుర్తించారు. వారిలో చాడ గ్రామానికి చెందిన రాజబోయిన శ్రీకాంత్, పులిగిల్ల గ్రామానికి చెందిన బుగ్గ లింగస్వామి, ఆత్మకూరు గ్రామానికి చెందిన నరేష్, కందుకూరుకు చెందిన మహేందర్, ఆలేరుకు చెందిన బర్ల శ్రీకాంత్, అనాజ్ పూర్ గ్రామస్థుడు నల్ల మహేష్ ఉన్నారు. కొందరి వివరాలు తెలియాల్సి ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి: