Pawan Kalyan about Mark Shankar Injury: అకీరా బర్త్‌డే రోజే మార్క్ కి ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఆవేదన!

Pawan Kalyan First Reaction on Son Mark Shankar Injury in Fire Accident: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తన కుమారుడి జరిగిన ప్రమాదంతో స్వయంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. అరకు పర్యటనలో ఉన్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుమారుడికి జరిగిన ప్రమాదన సంఘటనపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ఈ కష్టసమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
పెద్ద ప్రమాదం అనుకోలేదు..
తను అరకు పర్యటనలో ఉండగా ఉదయం ప్రమాదం గురించి ఫోన్ కాల్ వచ్చిందన్నారు. మొదట ఇది చిన్న ప్రమాదం అనుకున్నాని, తనకు ఈ ప్రమాద తీవ్రత గురించి తెలియదన్నారు. 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంప్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్న అగ్ని ప్రమాదం అనుకున్నాను, కానీ ఇంత పెద్ద ప్రమాదం అనుకోలేదు. అకీరా పుట్టిన రోజు నాడే మార్క్ శంకర్‌కు ఇలా జరగడం బాధగా ఉంది.
మార్క్ ఆరోగ్యం నిలకడగానే ఉంది: పవన్..
“ఈ ప్రమాదంలో మార్క్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పోగ వెళ్లింది. ప్రస్తుతం మార్క్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్క్‌కి బ్రాంకో స్కోపీ జరుగుతోంది. 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంప్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మొదట ఇది చిన్న ప్రమాదం అనుకున్నాను. కానీ ఇంత పెద్ద ప్రమాదం అనుకోలేదు. నా పెద్ద కొడుకు అకీరా పుట్టిన రోజు నాడు మార్క్‌కి ప్రమాదం జరగడం దురద్రష్టకరం. ప్రమాదం గురించి తెలియగానే ప్రధాన మంద్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి పరామర్శించారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా ఫోన్ చేసి మార్క్ ఆరోగ్యంపై ఆరా తీశారు. నా కొడుకు కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రస్తుతం మార్క్ ఆరోగ్యం నిలకడగానే ఉంది” అని పవన్ కళ్యాణ్ తెలిపారు.