Published On:

AP Fire Accident: ఏపీలో తీవ్ర విషాదం.. అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి

AP Fire Accident: ఏపీలో తీవ్ర విషాదం.. అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి

Fire Accident in Anakapalle: ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల మండల పరిధిలో ఉన్న కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 

సమాచారం అందిన వెంటనే హుటాహుటినా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, బాధితులు సామర్లకోట ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

 

కోటవురట్ల మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో బాణాసంచా కేంద్రం ఉంది. ఇందులో వివాహాలకు సంబంధించిన తారాజువ్వలు, చిన్న చిన్న బాంబులు తయారు చేస్తుంటారు. అయితే, రోజుమాదిరిగా బాణసంచా తయారీ కేంద్రంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మృతులు నిర్మల, తాతబాబు, గోవింద్‌లుగా గుర్తించారు. వీరంతా 36 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.