Patna: పాట్నాలో ఘోర అగ్ని ప్రమాదం … ఆరుగురి మృతి
బిహార్ రాజధాని పాట్నాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పాట్నా రైల్వే స్టేషన్‌కు సమీపంలో గురువారం హోట్‌లో లోపల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. వారిలో ముగ్గురు మహిళలున్నట్లు పాట్నా పోలీసులు తెలిపారు. పాట్నా జంక్షన్ సమీపంలో ఉన్న ఈ హోటల్‌లో సహాయక చర్యలు చేపట్టామని సిటి సెంట్రల్ ఎస్‌పీ చంద్రప్రకాశ్ చెప్పారు.
Patna:బిహార్ రాజధాని పాట్నాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పాట్నా రైల్వే స్టేషన్‌కు సమీపంలో గురువారం హోటల్ లోపల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. వారిలో ముగ్గురు మహిళలున్నట్లు పాట్నా పోలీసులు తెలిపారు. పాట్నా జంక్షన్ సమీపంలో ఉన్న ఈ హోటల్‌లో సహాయక చర్యలు చేపట్టామని సిటి సెంట్రల్ ఎస్‌పీ చంద్రప్రకాశ్ చెప్పారు.
పలువురికి గాయాలు..(Patna)
ఉదయం 11 గంటలకు హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో హోటల్‌లో సుమారు 20 కంటే ఎక్కువ మంది చిక్కుకు పోయారని పోలీసు అధికారలు తెలిపారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలతో పాటు… మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. వారంతా క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారని, వారిని ఆస్పత్రికి తరలించామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అయితే చనిపోయిన వారితో పాటు తీవ్రంగా గాయపడిన వారిని, వారి కుటుంబాలను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే హోటల్‌లో మంటలు వ్యాపించడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదన్నారు. ఫోరెన్సిక్ నిపుణులను సంఘటనా స్థలానికి రప్పించి మంటలకు గల కారణాలను గుర్తిస్తామన్నారు. వారు ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలుంటాయని ఎస్‌పీ వివరించారు. ఇదిలా ఉండగా జిల్లా మేజిస్ట్రేట్ శ్రీశాత్ కపిల్ అశోక్ మాట్లాడుతూ ఫైర్ ఆడిటింగ్‌కు ఆదేశించామన్నారు. నగరంలోని అన్నీ హోటల్స్, వాణిజ్య సంస్థలు ..ముఖ్యంగా ఇరుకైన ప్రాంతాల్లో ఉండే హోటల్స్ ఫైర్ సెప్టీ నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అని తెలుసుకుని దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు.