Last Updated:

Delhi Hospital Fire: ఢిల్లీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి

తూర్పు ఢిల్లీలోని చిల్ర్డన్‌ హాస్పిటల్‌లో శనివారం రాత్రి ఆస్పత్రిలో మంటలకు కొత్తగా పుట్టిన ఏడుగురు నవజాత శిశువులు ఆశువులు బాశారు. రెండు నెలల క్రితమే ఈ ఆస్పత్రి లైసెన్సు ముగిసినా.. ఆస్పత్రి మాత్రం యధాతథంగా నడుస్తోందని డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అధికారులు తెలిపారు.

Delhi Hospital  Fire: ఢిల్లీ  ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఏడుగురు  నవజాత శిశువుల మృతి

Delhi Hospital Fire: తూర్పు ఢిల్లీలోని చిల్ర్డన్‌ హాస్పిటల్‌లో శనివారం రాత్రి ఆస్పత్రిలో మంటలకు కొత్తగా పుట్టిన ఏడుగురు నవజాత శిశువులు ఆశువులు బాశారు. రెండు నెలల క్రితమే ఈ ఆస్పత్రి లైసెన్సు ముగిసినా.. ఆస్పత్రి మాత్రం యధాతథంగా నడుస్తోందని డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అధికారులు తెలిపారు.

ఆస్పత్రి యజమాని అరెస్ట్..(Delhi Hospital Fire)

కాగా ఢిల్లీ పోలీసులు సోమవారం ఆస్పత్రి యజమాని డాక్టర్‌ నవీన్‌ అరెస్టు చేశారు. కాగా తూర్పు ఢిల్లీలో వివేక్‌ విహార్‌లో న్యూ బార్న్‌ బేబీ కేర్‌ ఆస్పత్రిని డాక్టర్‌ నవీన్‌ లైసెన్సు లేకుండా నడిపిస్తున్నారు. ఇక ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ అధికారులు సమాచారం ప్రకారం శనివారం రాత్రి సుమారు 11.30 గంటలకు ఆస్పత్రిలో మంటలు ఎగిసిపడ్డాయని తమకు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి తొమ్మిది ఫైర్‌ టెండర్లను పంపించామని చెప్పారు, కాగా ఈ మంటలకు ప్రధాన కారణం షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యి ఉండవచ్చునని వారుఅనుమానం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన శిశువుల కుటుంబానికి రూ. 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆస్పత్రిలో జరిగిన దుర్ఘటన తన గుండెలను పిండి వేసిందని ప్రధాని ఒక ప్రకటనలో బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. తీవ్ర మానసిక సంక్షోభంలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని మోదీ ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు.

ఇదిలా ఉండగా ఇదే న్యూఢిల్లీలో మరో సంఘటనలో ముగ్గుర వ్యక్తులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఈస్ట్‌ ఢిల్లీలోని కృష్ణనగర్‌లో డిస్ర్టిక్‌లో ఓ రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో ఆదివారం తెల్లవారుఝామున మంటలంటుకున్నాయి. కాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ సిటిలో గేమింగ్‌ జోన్‌లో మంటలంటుకొని భవనం కుప్పకూలి 27 మంది దుర్మరణం పాలైన కొద్ది గంటలకే ఇక్కడి భవనంలో మంటలంటుకొని ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: