Jeep Grand Cherokee: ఈ కారును కొంటే లక్షలు ఆదా చేసినట్టే.. భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ.. భారీగా తగ్గింపులు..!

Jeep Grand Cherokee: మీరు ఈ నెలలో మీ కోసం ఒక శక్తివంతమైన ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? జీప్ గ్రాండ్ చెరోకీ మంచి ఎంపిక కావచ్చు. నిజానికి ఈ ప్రీమియం, లగ్జరీ కారుపై కంపెనీ ఈ నెలలో రూ. 3 లక్షల నగదు తగ్గింపును ఇస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 67.50 లక్షలు. ఈ ఎస్‌యూవీపై కంపెనీ రూ.12 లక్షల వరకు తగ్గింపును కూడా ఇచ్చింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇది అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కారు కూడా. ఈ నెల మే 31 వరకు మాత్రమే కస్టమర్లు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందుతారు.
Jeep Grand Cherokee Design
ఇది దాని పాత మోడల్ కంటే పదునైన డిజైన్‌ను కలిగి ఉంది, ఇది సన్నగా ఉండే హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్‌లతో ఉంటుంది. జీప్ సిగ్నేచర్ 7-స్లాట్ గ్రిల్, ‘జీప్’ లోగో దాని ముందు భాగంలో చూడచ్చు. చతురస్రాకారపు వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్, 20-అంగుళాల, మెటాలిక్ అల్లాయ్ వీల్స్ గ్రాండ్ చెరోకీకి బలమైన ఆకర్షణను ఇస్తాయి. వెనుక భాగంలో సన్నని LED టెయిల్ లైట్లు, క్రోమ్ సరౌండ్‌తో వెనుక విండ్‌షీల్డ్‌ను పొందుతుంది.
Jeep Grand Cherokee Engine
ఈ ఎస్‌యూవీ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ ఇంజిన్ 270హెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆఫ్‌రోడింగ్ విషయానికొస్తే భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని ఇతర ఎస్‌యూవీలను అధిగమిస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 215 మి.మీ, దీని కారణంగా గ్రాండ్ చెరోకీ నీటిలో 533 మి.మీ లోతు వరకు దూసుకెళ్లగలదు. జీప్ గ్రాండ్ చెరోకీ ఒకే వేరియంట్, 4 కలర్స్‌లో లభిస్తుంది.
Jeep Grand Cherokee Features
ఈ ఎస్‌యూవీలో 10.25-అంగుళాల ఫ్రంట్ కో-ప్యాసింజర్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో క్లాస్-లీడింగ్ టెక్నాలజీని అందిస్తుంది. ఇది కాకుండా, ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.0-అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లే, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉన్నాయి. మొదటి వరుసలో కూర్చున్న వారికి, ఇది 10-అంగుళాల 4K డిస్‌ప్లేను పొందుతుంది. దీనికి 1,076 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
Jeep Grand Cherokee Specifications
గ్రాండ్ చెరోకీ ఇతర స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుకుంటే, ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు, సరౌండ్ వ్యూ కెమెరా, వెంటిలేషన్‌తో లెదర్ సీట్లు, 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. భద్రత కోసం 8 ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, టెర్రైన్ రెస్పాన్స్ మోడ్ , అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రెయిన్ బ్రేక్ సపోర్ట్, హెడ్-అప్ డిస్‌ప్లే , సరౌండ్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి.