Published On:

14వ పోప్ రాబర్ట్ ప్రివోస్ట్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

14వ పోప్ రాబర్ట్ ప్రివోస్ట్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Robert Prevost as the 14th Pope : ఏప్రిల్ 21న క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడున్న ఆయన 88 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కాగా, పోప్ మరణం అనంతరం అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ కొత్త పోప్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు పోప్ లియో-14గా నామకరణం చేశారు. కొత్త పోప్‌ను ఎన్నుకునేందుకు రహస్యంగా సిస్టిన్ చాపెల్‌‌లో సమావేశమైన 133 మంది కార్డినల్స్ పోప్‌ను నియమించారు. సంప్రదాయం ప్రకారం సిస్టిన్ చాపెల్ పైనుంచి తెల్లటి పొగ వెలువడింది. దీంతో కార్డినల్స్ భేటీ అయ్యారు. భేటీ అయిన రెండోరోజు నూతన పోప్ ఎన్నిక పూర్తయినట్లు ప్రకటించారు. దీంతో అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొదటి వ్యక్తిగా రాబర్ట్ రికార్డు స్పష్టించారు.

 

కాగా, పోప్ లియో 14గా ఎన్నికైన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్‌కు భారత ప్రధాని మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు. ‘భారత ప్రజల తరఫున పవిత్ర పోప్ లియో 14కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సామరస్యం, సంఘీభావం, సేవ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడం, కాథలిక్ చర్చికి నాయకత్వం చాలా ప్రాముఖ్యత కలిగిన సమయంలో వస్తుంది. మన ఉమ్మడి విలువలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి హోలీ సీతో నిరంతర సంభాషణ భారతదేశం కట్టుబడి ఉందని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: