Home / Chhattisgarh
Encounter in Chhattisgarh three Naxalites died: ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో మావోయిస్టులు, భద్రతా బలగాలు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ సరిహద్దులో ఉన్న సౌత్ బీజా పూర్ జిల్లాలోని ఉసూర్ బాసగూడ, […]
Massive encounter in Chhattisgarh: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టుల హతమయ్యారు. అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో పోలీసుల చేతిలో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా చేపట్టిన సెర్స్ ఆపరేషన్‌లో ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాల ప్రకారం.. గురువారం […]
చత్తీస్‌గఢ్‌లో మారోమారు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. శనివారం నాడు నారాయణపూర్ జిల్లాలో అభుజమార్హా లో భద్రతాదళాలకు.. నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
చత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలకు.. నక్సలైట్లకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందారు. నారాయణపూర్ -బీజూపూర్ జిల్లాల సరిహద్దులో గల అటవీ ప్రాంతంలో గురువారం నాడు భద్రతా దళాలకు .. నక్సలైట్లకు మధ్య ఎదుర కాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారని పోలీసులు తెలిపారు.
చత్తీస్‌గఢ్‌లో పికప్ వ్యాన్ బోల్తా పడ్డంతో సుమారు 18 మంది మృతి చెందారు. వారిలో 17 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.. నలుగురికి గాయాలు అయ్యాయని చత్తీస్‌గఢ్‌లోని కబీర్‌థామ్ జిల్లాలో పికప్ వ్యాన్ లోయలోపడ్డంతో జరిగిన ఘటనతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అధికారులు సోమవారం నాడు చెప్పారు
: చత్తీస్‌గఢ్ మరోమారు రక్తమోడింది. తాజాగా మంగళవారం నాడు చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతాదళాలకు .. మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాగా నక్సల్స్‌ఏరివేత కార్యక్రమంలో జిల్లా రిజర్వ్ గార్డ్లు, స్పెషల్ టాక్స్ ఫోర్స్‌లు పాల్గొన్నాయని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో ప్రయాణీకులతో ఉన్న గూడ్స్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో మహిళలు, పిల్లలు సహా పది మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పాతర్రా గ్రామానికి చెందిన బాధితులు తిరయ్య గ్రామంలో జరిగిన కుటుంబ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం మావోస్టులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా.. మరో పద్నాలుగుమంది జవాన్లు గాయపడ్డారు.ఇదే ప్రాంతంలో 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఐజీ బస్తర్ పి సుందర్రాజ్ చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జైలు సమీపంలోని భన్సీలో సోమవారం తెల్లవారుజామున నక్సలైట్లు నిర్మాణ సంస్థకు చెందిన 16 వాహనాలకు నిప్పు పెట్టారు.దంతేవాడ నుండి బైలదిల్లా రోడ్డు వరకు విస్తరించేందుకు కంపెనీ భాన్సీలోని బెంగాలీ క్యాంపు సమీపంలో క్యాంపును ఏర్పాటు చేసింది. సోమవారం తెల్లవారుజామున నక్సలైట్లు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును బెదిరించి వాహనాలకు నిప్పు పెట్టారు.
మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.