Home / Encounter
Encounter in Chhattisgarh three Naxalites died: ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో మావోయిస్టులు, భద్రతా బలగాలు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ సరిహద్దులో ఉన్న సౌత్ బీజా పూర్ జిల్లాలోని ఉసూర్ బాసగూడ, […]
Encounter underway between security forces and Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా సిబ్బందికి మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఒడిశా సరిహద్దులు మీదుగా దాటుకుంటూ చత్తీస్‌గఢ్‌లోకి కొంతమంది మావోయిస్టులు ప్రవేశించినట్లు సమాచారం అందింది. దీంతో నిఘా వర్గాల […]
జమ్ము కశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక అధికారితో సహా నలుగురు భారత ఆర్మీ సైనికులు మరణించారు. సోమవారం రాత్రి రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన దళాలు మరియు జమ్ము అండ్ కశ్మీర్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ జాయింట్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఎన్కౌంటర్ ప్రారంభమయింది.
చత్తీస్‌గఢ్‌లో మారోమారు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. శనివారం నాడు నారాయణపూర్ జిల్లాలో అభుజమార్హా లో భద్రతాదళాలకు.. నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
చత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలకు.. నక్సలైట్లకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందారు. నారాయణపూర్ -బీజూపూర్ జిల్లాల సరిహద్దులో గల అటవీ ప్రాంతంలో గురువారం నాడు భద్రతా దళాలకు .. నక్సలైట్లకు మధ్య ఎదుర కాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారని పోలీసులు తెలిపారు.
: చత్తీస్‌గఢ్ మరోమారు రక్తమోడింది. తాజాగా మంగళవారం నాడు చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతాదళాలకు .. మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాగా నక్సల్స్‌ఏరివేత కార్యక్రమంలో జిల్లా రిజర్వ్ గార్డ్లు, స్పెషల్ టాక్స్ ఫోర్స్‌లు పాల్గొన్నాయని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందన్నారు.
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం మావోస్టులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా.. మరో పద్నాలుగుమంది జవాన్లు గాయపడ్డారు.ఇదే ప్రాంతంలో 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఐజీ బస్తర్ పి సుందర్రాజ్ చెప్పారు.
జమ్ము కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు మరణించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ధర్మశాల సమీపంలోని బజిమాల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఓ అధికారి, సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి గాయాలయ్యాయని వెల్లడించారు.
మంగళవారం తెల్లవారుజామున ఒడిశాలోని కలహండి జిల్లాలో రాష్ట్ర నిఘా విభాగం (ఎస్‌ఐడబ్ల్యూ) భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించగా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ర్యాంక్ అధికారి గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో డీఆర్జీ జవాన్లు, నక్సల్స్ మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.