Pawan Kalyan: ఉగ్రదాడి కలిచి వేసింది.. 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Janasena mourning next three days: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారు. తాజాగా, ఈ దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. పహల్గామ్ ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడించారు.
ఈ దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. పహల్గామ్ ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడించారు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తీవ్రంగా కలచివేస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. మృతుల గౌరవార్థం రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు జనసేన పార్టీ సంతాప దినాలుగా పాటిస్తుందని, జనసేన పార్టీ జెండాను అవనతం చేస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దృఢంగా ఉందామని, ఉగ్రవాదం భారతీయుల ఐక్యతను దెబ్బతీయలేదన్నారు. ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా చూడాలన్నారు.
దేశ భద్రతా దళాలపై విశ్వాసం ఉందని, సమిష్టిగా అధిగమించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉగ్రవాదంపై కలిసి కట్టుగా ఉందామని పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, మంగళగిరిలో ఉన్న జనసేన పార్ట కార్యాలయంలో ఉగ్రవాద దాడిని ఖండిస్తూ పార్టీ జెండాను అవనతం చేశారు.
ఇందులో భాగంగానే, తొలి రోజు అన్ని జనసేన పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాలను సగం ఎత్తులో ఎగురవేస్తారు. తర్వాతి రోజు సాయంత్రం పార్టీ కార్యాలయాల వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన ఉండనుంది. ఇక, చివరి రోజు సాయంత్రం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలుపడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించనున్నారు.