Home / Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan speech about Visakhapatnam pollution: విశాఖ తీరంలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ శాసనమండలి సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకపోవడంతో విపరీతంగా పెరిగిందని విమర్శలు చేశారు. విశాఖ తీరంలో వాయి కాలుష్య స్థాయి దాదాపు 7 రెట్లు పెరిగిందని వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం […]
Deputy CM Pawan Kalyan Powerful Speech in Assembly: వైసీసీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అన్నీ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్నారు. బుధవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పవన్ మాట్లాడారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఏపీగా మార్చారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అనుభవం పాలనలో ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్ర పాలనను గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. 150 […]
Deputy CM Pawan Kalyan Speech in Assembly: గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. అసెంబ్లీలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వం పాసు పుస్తకాలకు సైతం తమ ఫొటోలు వేసుకున్నారన్నారు. కానీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ అన్నారు. చంద్రబాబు పాలనపై సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు నిరూపించారన్నారు. ఏపీ సమగ్రాభివృద్ధి దిశగా […]
Deputy CM Pawan Kalyan: మహిళలకు సంబంధించిన మిస్సింగ్ కేసులను ఛేదించిన విజయవాడ సిటీ పోలీసులకు మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. ఆది నుంచే ఆగని పోరు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు, బాలికలు అదృశ్యమైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఏపీ డిప్యూటీ సీఎం […]
Deputy CM Pawan Kalyan in assembly sessions: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే ప్రభుత్వ ధ్యేయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శాసనమండలిలో గ్రామాల్లో డంపింగ్ యార్డులపై చర్చ జరిగింది. ఈ మేరకు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలు చెప్పారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగానే 15వ ఫైనాన్స్ నిధులు సంపద సృష్టి కేంద్రాలకు కేటాయించామని […]
Deputy CM Pawan Kalyan About RRR: నవ్విన నాప చేనే పండిందన్న సామెత నిజమైంది. ఎవరినైతే… తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టనివ్వమని సవాల్ చేశారో… వారే అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. ఆ ఛాలెంజ్ చేసిన వారే కనీసం సభలోకి కూడా రాకుండా జనం గత ఎన్నికల్లో స్క్రిప్ట్ రాశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దీనికి సాక్ష్యం కాగా.. డిప్యూటీ స్పీకర్ గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు […]
AP Cabinet Key Decision over Pithapuram Development: 5 నెలల వరకు ఓ సాధారణ నియోజకవర్గంగా ఉన్న ప్రాంతం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. గతంలో ఏ పని కావాలన్నా, ఏ సంక్షేమ పథకం అందాలన్నా ముఖ్యమంత్రికో.. రాష్ట్ర మంత్రులకో విన్నవించుకోవాల్సిన పరిస్థితి నుంచి మాటంటే చాలు.. క్షణాల్లో పనులు జరిగిపోతున్న రోజులకు మారాయి. గతమెంతో ఘనమైనా, ఎన్నో ప్రఖ్యాతలు ఉన్నా… ఇన్నాళ్లూ మరుగున పడిపోయిన పిఠాపురానికి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. అభివృద్ధి, సంక్షేమంతో […]
విశాఖపట్నం, తిరుపతి జూలాజికల్ పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, ఎక్కువ మంది సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికీ ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని చెబుతూ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు ప్రస్తావిస్తారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు 3వ రోజు పిఠాపురంలో పర్యటించారు. ఉప్పాడ కొత్తపల్లిలో తీరం వద్ద కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించారు. కోతకు గురవుతున్న తీరును అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా పవన్‌కు వివరించారు. అనంతరం అక్కడి నుంచి చేబ్రోలులో అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు.