Published On:

IPL 2025, 41st Match: ముంబైతో హైదరాబాద్ కీలక మ్యాచ్.. నల్లబ్యాడ్జ్‌లు ధరించనున్న ప్లేయర్లు.. చీర్ లీడర్స్ ఉండరు!

IPL 2025, 41st Match: ముంబైతో హైదరాబాద్ కీలక మ్యాచ్.. నల్లబ్యాడ్జ్‌లు ధరించనున్న ప్లేయర్లు.. చీర్ లీడర్స్ ఉండరు!

Players To Wear Black Armbands And No Cheerleaders In SRH vs MI Match: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో దాదాపు 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు తెలుగుప్రాంతాల వారు ఉండగా.. ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రగాఢ సానుభూతి తెలిపి నివాళులర్పించారు. అయితే ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ఇవాళ ఉప్పల్ వేదికగ సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఉగ్రవాద దాడి నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు బీసీసీఐ సంఘీభావం తెలిపేలా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అంపైర్లు చేతులకు నల్లబ్యాడ్జ్‌లు ధరించనున్నారు. అలాగే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక నిమిషం పాటు ప్రేక్షకులతో పాటు అందరూ మౌనం పాటిస్తారని ఐపీఎల్ వర్గాలు చెప్పాయి.

 

అంతేకాకుండా, ఉగ్రదాడి నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రా్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో చీర్ లీడర్లు, ఫైర్ వర్స్క్ సెలబ్రేషన్స్ సైతం నిర్వాహకులు రద్దు చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. కాగ, ఇప్పటికే ఉగ్రదాడిపై మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లు సైతం ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధితులకు విరాట్ కోహ్లీ, పాండ్య అండగా మద్దతు తెలిపారు.