Home / Janasena
Amaravati: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు తలవంచి మొక్కుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ఐదేళ్లుగా వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పోలీసులతో లాఠీ దెబ్బలు బారిన పడ్డారని.. అమరావతి కోసం వారు చేసిన పోరాటాన్ని ఎన్నటికీ మరిచిపోలేమని తెలిపారు. చివరికి 2000 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే ప్రధాని నరేంద్ర మోదీతో రాజధాని పనులు పునఃప్రారంభించుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో […]
Pawan Kalyan face-to-face with workers : శ్రామికులు లేకపోతే దేశ నిర్మాణం లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మే డే సందర్భంగా మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మిక దినోత్సవం నుంచి కూలీలు కాదని, ఉపాధి శ్రామికులని పిలుస్తామని హామీనిచ్చారు. శ్రామికుల మాటలు వింటే ఎంతో ఆనందం కలిగిందన్నారు. తాము కూడా చిన్నప్పుడు మూడెకరాల భూమిని అమ్ముకున్నట్లు వివరించారు. పాతికేళ్ల కింద ఎనిమిదెకరాల […]
Pawan Kalyan donates Rs.50 lakhs : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. జమ్ముకాశ్మీర్‌లోని పవాల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సోమిశెట్టి కుటుంబానికి పవన్ జనసేన పార్టీ తరఫున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. అతడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పహల్గాం అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పవన్ […]
Deputy CM Pawan Kalyan : ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో పరుగులు పెడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులందరం సమన్వయంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నామని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేశారు. పిఠాపురం అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు.. రైతులకు వ్యవసాయం పనిముట్లు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పిఠాపురంలో […]
Janasena mourning next three days: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారు. తాజాగా, ఈ దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. పహల్గామ్ ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడించారు. ఈ […]
awan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ సింగపూర్‌లో ఓ పాఠశాలలో జరిగిన ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందగా, మార్క్ శంకర్‌ను వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ భార్యతో కలిసి సింగపూర్ వెళ్లిన పవన్… శనివారం రాత్రి పవన్ తన భార్య అన్నాలెజినోవా, కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. తన […]
Pawan Kalyan’s Son injured in fire at Singapore School: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన రద్దు అయింది. అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పవన్ అరకు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. దీంతో కొడుకుకు సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పవన్ కల్యాణ్ తన విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం తన అరకు పర్యటనను పూర్తి చేసుకొని […]
AP Govt Announces Chairmen for 47 Market Committees: కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీకు ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. తాజాగా, ఏపీ సర్కార్ ప్రకటించిన 47 మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 37, జనసేనకు 8, బీజేపీకి 2 పదవులు […]
Pawan Kalyan : పిఠాపురం అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో జరుగుతున్న అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షలో కీలక సూచనలు చేశారు. నియోజకవర్గ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న […]
Chandragiri : తిరుపతి జిల్లా చంద్రగిరిలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని కార్యకర్తలు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, ఇన్‌చార్జి దేవర మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నాగాలమ్మ దేవాలయం నుంచి కొత్త కార్యాలయం వరకు కొనసాగింది. కార్యకర్తలు, స్థానిక జనసేన అనుచరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. […]