Pawan Kalyan : కొడుకు మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్న పవన్ కల్యాణ్

awan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ సింగపూర్‌లో ఓ పాఠశాలలో జరిగిన ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందగా, మార్క్ శంకర్‌ను వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ భార్యతో కలిసి సింగపూర్ వెళ్లిన పవన్… శనివారం రాత్రి పవన్ తన భార్య అన్నాలెజినోవా, కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. తన కుమారుడిని పవన్ ఎత్తుకుని విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి. కొన్నిరోజులు విశ్రాంతి అవసరమని, ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్, అభిమానులు, జనసైనికులు ఆందోళన చెందారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. కొడుకు మార్క్ శంకర్ సింగపూర్‌లో చదువుతున్నారు. అతడు చదువున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. స్పందించిన పాఠశాల సిబ్బంది మంటలను అర్పించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మార్క్ శంకర్ గాయపడ్డాడు. చేతులు, కాళ్లు గాయాలయ్యాయి. దట్టమైన పొగ కారణంగా ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకుంది. మార్క్ శంకర్‌కి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో సింగపూర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మార్క్ ప్రస్తుతం కోలుకున్నాడు. ఇటీవల చిరంజీవి తన ఎక్స్‌లో మార్క్ శంకర్ ఇంటికి తిరిగొచ్చేశాడు అని కామెంట్ పెట్టారు.