Deputy CM Pawan Kalyan : శాంతిభద్రల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Deputy CM Pawan Kalyan : ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో పరుగులు పెడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులందరం సమన్వయంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నామని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేశారు.
పిఠాపురం అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు..
రైతులకు వ్యవసాయం పనిముట్లు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడినా పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.