Pawan’s Wife Anna Lezhneva Visited Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజనోవా..!

Deputy CM Pawan Kalyan wife Anna Lezhneva Konidela Visited Tirumala: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్న లెజనోవా తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె స్వామి వారిని దర్శించుకొని ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.
ఇదిలా ఉండగా, టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్ట్‌కు అన్నా లెజినోవా విరాళం అందించారు. ఆమె కుమారుడు మార్క్ శంకర్ పేరుతో రూ.17లక్షల చెక్కును ఇచ్చారు. అలాగే ఇవాళ మధ్యాహ్నం అన్నవితరణకు అయ్యే ఖర్చును విరాళంగా అందజేశారు.
కాగా, వేంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లిన అన్నా లెజినోవా.. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం సందర్శించారు. ఈ మేరకు అన్నసత్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదం వడ్డించారు.
అంతకుముందు, రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్న ఆమె అన్య మతస్తురాలు కావడంతో గాయత్ని సదనంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం పద్మావతి కల్యాణ కట్టలో తమ కుమారుడు కోసం అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించింది.
ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ పాఠశాలలో ప్రమాదానికి గురయ్యారు. పాఠశాలలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో మార్క్ శంకర్‌కు కాళ్లతో పాటు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మార్క్ శంకర్‌కు ఊపిరితిత్తులకు పొగ పీల్చడంతో ఇబ్బంది పడినట్లు వైద్యులు తెలిపారు.