Last Updated:

Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారు.. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలసందర్బంగా ఆయన బీజేపీ అభ్యర్దికి మద్దతుగా అహ్మదాబాద్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.

Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారు.. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ

Himanta Biswasharma: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలసందర్బంగా ఆయన బీజేపీ అభ్యర్దికి మద్దతుగా అహ్మదాబాద్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా శర్మ మాట్లాడుతూ అతను గుజరాత్‌లో కనిపించడు, అతను విజిటింగ్ ఫ్యాకల్టీ లాగా రాష్ట్రానికి వస్తాడు.. అతను హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ప్రచారం చేయలేదు, అతను ఎక్కడెక్కడోఉన్న ప్రాంతాలను మాత్రమే సందర్శిస్తున్నాడు. అక్కడ ఎన్నికలు లేవు.. ఓటమి భయమే కారణం కావచ్చు..రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేరేందుకు బాలీవుడ్ తారలకు కాంగ్రెస్ తప్పనిసరిగా డబ్బులిచ్చి ఉంటుందని ఆరోపించారు.

హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలకు అస్సాం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా కౌంటర్ ఇచ్చారు. మీరు వార్తల్లోకి ఎక్కాలంటే రాహుల్ గాంధీని విమర్శించాలి. దానికోసం మీరు ఏ స్దాయికైనా వెడతారు, మేము ఇలాంటివాటిని పట్టించుకోమని అన్నారు. అంతకుముందు రోజు ధన్సురాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ‘లవ్ జిహాద్’ను అరికట్టడానికి కఠినమైన చట్టాలను తీసుకురావాలని శర్మ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి: