Home / Rahul Gandhi
BJP MP alleges Rahul Gandhi pushed him in Scuffle outside Parliament: పార్లమెంట్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలు చేపట్టారు. హోం మంత్రి అమిత్ షా రాజీనామాకి పట్టుబడుతూ ఇండియా కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు నిరసన చేస్తున్నారు. అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారంటూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీల నిరసనలో […]
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సోమవారం అసోంకు చేరుకుని లఖిపూర్‌లోని ఫులెర్తాల్ సహాయ శిబిరంలో వరద బాధిత బాధితులను పరామర్శించారు. ముందగా సిల్చార్ జిల్లాలోని కుంభిగ్రామ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడనుంచి లఖిపూర్‌లోని వరద సహాయ శిబిరానికి చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాటలో మరణించిన బాధితుల కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు.హత్రాస్ పర్యటనకు ముందు అలీఘర్‌లోని పిలాఖ్నా గ్రామంలో ఆగి, అక్కడ కూడా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ తన దైన శైలిలో సెటైర్లు వేసారు. మంగళవారం లోక్ సభలో ప్రసంగిస్తూ 'షోలే' సినిమాలో డైలాగ్ ను ఉదహరిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసారు.పార్లమెంటు ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి తాను ఏదో సాధించానన్న భావనలో కాంగ్రెస్ ఉందని అన్నారు.
సోమవారం లోక్హ సభలో తన ప్రసంగంలోని భాగాలు మరియు భాగాలను తొలగించిన విధానం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు రికార్డుల నుండి తొలగించబడిన వ్యాఖ్యలను పునరుద్ధరించమని అభ్యర్దిస్తున్నానని కోరారు
హిందూత్వం భయం, ద్వేషాలను వ్యాప్తి చేయదు.. అయితే బీజేపీ అదే చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటు ఉభయసభల నుద్దేశించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ హిందూ మతం అంటే భయం, ద్వేషం మరియు అసత్యాలను వ్యాప్తి చేయడం కాదని బీజేపీపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్‌గాంధీ లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని పలువురు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాహుల్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రతాప్‌సింగ్ బజ్వా చెప్పారు.
బెంగళూరు కోర్టులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బెయిల్ దక్కింది. గత ఏడాది కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పటి భారతీయ జనతాపార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, 40 శాతం కమిషన్ తీసుకుని పనులు చేస్తోందని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వార్త పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది.
లోకసభ ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. మెజారిటీ మార్కుకు 272 సీట్లకు గాను 240 సీట్ల వద్ద చతికిలపడింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంది. అంచనాకు మించి సీట్లు దక్కించుకుంది.
రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? గత కొంత కాలంగా రాజన్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు వెల్లువెత్తాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. డిసెంబర్ 2022లో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో రాజన్ రాహుల్‌తో కలిసి వెంట నడిచారు.