Published On:

New Rule Changes From May 1: బిగ్ అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్.. మారుతున్నవి ఏంటంటే?

New Rule Changes From May 1: బిగ్ అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్.. మారుతున్నవి ఏంటంటే?

New Rule Changes From May 1: బిగ్ అలర్ట్. ప్రభుత్వ నిబంధనల మేరకు పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేటి నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకు అకౌంట్ నిబంధనలతో పాటు ఏటీఎం లావాదేవీలు, బ్యాంకుల ఫిక్స్‌‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు, ఇన్‌కం ట్యాక్స్ ఐటీఆర్ తదితర వాటిలో మార్పులు జరగనున్నాయి. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను సైతం ఇవాళ నిర్ణయించనున్నారు.

1.ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు

ఆర్బీఐ కొత్త నియమ, నిబంధనల మేరకు ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల విషయంలో మార్పులు వచ్చాయి. నేటి నుంచి ఉచిత లావాదేవీలు పరిమితి దాటితే వినియోగదారులు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటించింది. గతంలో ప్రతి అదనపు లావాదేవీకి ఈ ఛార్జీ రూ.21 ఉండగా, తాజాగా రూ.23కి పెంచింది. ఈ కొత్త ఛార్జీలు నేటి నుంచి వర్తించనున్నాయి.

 

2.రైల్వే టికెట్ బుకింగ్ రూల్స్

ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి స్లీపర్, ఏసీ కోచ్‌లలో వెయిటింగ్ లిస్ట్ చెల్లుబాటు ఉండవు. కేవలం జనరల్ కోచ్‌లలో మాత్రేమ చెల్లుబాటు అవుతాయని ఇండియన్ రైల్వే పేర్కొంది. అలాగే అడ్వాన్స్ రిజర్వేషన్ సమయాన్ని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించేశారు. ఈ నిబంధనలు మే 1 నుంచి అందుబాటులోకి వస్తుంది.

 

3.దేశమంతా ఒకే నినాదం

నేటి నుంచి ‘ఒకే దేశం.. ఒకే ఆర్ఆర్‌బీ స్కీమ్ అందుబాటులోకి రానుంది. ఈ పథకం దాదాపు 11 రాష్ట్రాల్లో అమలులోకి వస్తుంది. అయితే ఈ 11 రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఆర్ఆర్‌బీగా పిలుస్తారు. ఇందులో భాగంగానే ఏపీ, యూపీ, వెస్ట్ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అమలులోకి రానుంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. బ్యాంకింగ్ సేవలు పెరిగి మరింత సులభంగా ఉంటుంది.

 

4.సేవింగ్స్, ఎఫ్డీ అకౌంట్స్ వడ్డీ రేట్లలో మార్పు

సేవింగ్స్, ఎఫ్‌డీ అకౌంట్స్ వడ్డీ రేట్లలో మార్పులు జరుగుతాయి. ఈ మేరకు నేటి నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్స్‌పై వడ్డీ రేట్లలో మార్పులు జరగనున్నాయి.ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 సార్లు రెపో రేటు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను తగ్గించగా.. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది.