Home / Assam
Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిరోజుల కింద అస్సాంలో పాక్ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో సీఎం ఓ కాంగ్రెస్ ఎంపీపై హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీ గౌరవ్ గగోయ్ భార్యకు సైతం పాక్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. గౌరవ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ పాక్‌కు 19 సార్లు ప్రయాణించారని సీఎం […]
Pahalgam attack : పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాలకు అసోం సర్కారు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా అసోం కేబినెట్ మంగళవారం తీర్మానం చేసింది. విషయాన్ని ఆ రాష్ట్రం సీఎం హిమాంత బిశ్వశర్మ మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. మహిళలు, చిన్నారులను వదిలేసి పురుషులనే టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. […]
Earthquake of magnitude 5 strikes Assam: అస్సాం రాష్ట్రంలో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.25 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం రావడంతో ఇళ్లల్లోని వస్తువులు కదిలాయి. ఒక్కసారిగా ఇంట్లో వస్తువులు కదలినట్లు శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, […]
PM Modi at Advantage Assam 2.0: అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ పాలనలో అసోం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. గౌహతిలో అడ్వాంటేజ్ అసోం 2.0 బిజినెస్ సమ్మిట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. గత ఆరేళ్ల బీజేపీ పాలనలో అసోం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రెట్టింపు అయిందని, దేశాభివృద్ధిలో అసోం భాగస్వామ్యం నానాటికీ పెరగటం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ప్రగతి కేంద్రంగా ఈశాన్యం ఈ సందర్భంగా ప్రధాని మోదీ […]
Three feared dead in Assam coal mine mishap: అస్సాం బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దిమా హసావ్ జిల్లాలోని ఓ గనిలో 9 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ మేరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోయినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, డైవర్స్, హెలికాప్టర్లు, ఇంజినీర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. […]
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సోమవారం అసోంకు చేరుకుని లఖిపూర్‌లోని ఫులెర్తాల్ సహాయ శిబిరంలో వరద బాధిత బాధితులను పరామర్శించారు. ముందగా సిల్చార్ జిల్లాలోని కుంభిగ్రామ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడనుంచి లఖిపూర్‌లోని వరద సహాయ శిబిరానికి చేరుకున్నారు.
అసోంలో వరదలకు 56 మంది ప్రాణాలు కోల్పోగా 18 లక్షలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అస్సాంలోని చాలా జిల్లాలకు వర్షం హెచ్చరికలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద నివేదిక ప్రకారం 27 జిల్లాల్లో బుధవారం నాటికి 16.25 లక్షల మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారు.
అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. భారీ వరదలకు సుమారు 15 జిల్లాల్లో 1.61 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపించింది.
రాహుల్ తన భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రంలోని నాగాంవ్‌లోని బటద్రవ థాన్ లో స్థానిక దేవతను దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు అధికారులు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీతో పాటు ఎమ్మెల్యేలను అనుమతించారు. కానీ కాంగ్రెస్ నాయకులను మాత్రం అనుమతించలేదు.
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో బొగ్గుతో కూడిన ట్రక్కును బస్సు ఢీకొనడంతో కనీసం 12 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు.గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలోని బలిజన్ ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని గోలాఘాట్ ఎస్పీ రాజేన్ సింగ్ తెలిపారు.