Congress MP Rahul Gandhi: తక్షణమే సమావేశం పెట్టండి.. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ

Congress leader Rahul Gandhi writes letter to PM Modi for Parliament Special Session: ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎల్లప్పుడూ మనం కలిసి నిలబడతామని దేశం చూపించాలన్నారు.. పహల్గామ్ దాడి ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యతను ప్రదర్శించాలని విపక్షాలు కోరుకుంటున్నాయని లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రధాని మోదీకి ఏఐసీసీ చీప్ మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందించారు. పహల్గామ్ దాడిపై పార్లమెంట్ నిర్వహించాలని పేర్కొన్నారు.