Published On:

Rahul Gandhi : పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబానికి రాహుల్ గాంధీ పరామర్శ

Rahul Gandhi : పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబానికి రాహుల్ గాంధీ పరామర్శ

Congress leader and MP Rahul Gandhi : పహల్గాం ఉగ్రదాడితో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతిచెందగా, కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హర్యానాలోని నర్వాల్ వినయ్ నివాసానికి వెళ్లి రాహుల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

 

హర్యానాకు చెందిన వినయ్ హిమన్షి పెళ్లి ఏప్రిల్ 16న జరుగగా, 19వ తేదీన విందు ఏర్పాటు చేశారు. అనంతరం అతడు భార్యను తీసుకొని జమ్మూకశ్మీర్‌కు హనీమూన్‌కు వెళ్లారు. ముందు యూరప్ వెళ్లాలని యువ జంట నిర్ణయించుకున్నారు. తమ వీసాలు రిజెక్టు కావడంతో జమ్మూకశ్మీర్‌కు వచ్చారు. ఉగ్రదాడితో వినయ్ భార్య కలలు ఆవిరయ్యాయి. వివాహం వారం రోజులు గడవక ముందే తన కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. భర్త అంత్యక్రియల సందర్భంగా సెల్యూట్ చేస్తూ ఆమె రోదనలు ప్రతిఒక్కరినీ కలచివేశాయి.

 

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఒక వర్గాన్ని లక్ష్యం చేసేలా వ్యాఖ్యలు చేయరాదని వినయ్ నర్వాల్ భార్య కోరారు. దీంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను ట్రోల్  చేశారు. వారి చర్యలను మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. మహిళ గౌరవాన్ని కాపాడటానికి అన్నీ చర్యలు తీసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే స్పందించారు. హిమాన్షిపై విద్వేషంతో కూడిన కామెంట్స్ చేస్తున్న వారి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు.

ఇవి కూడా చదవండి: