Published On:

Karregutta: కర్రెగుట్టల్లో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు.. అడుగడుగునా మందుపాతరలు

Karregutta: కర్రెగుట్టల్లో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు.. అడుగడుగునా మందుపాతరలు

Three female Maoists Bodies Identifed in Karregutta Forests: ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టల్లో ఎనిమిదో రోజు భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. అయితే తనిఖీల్లో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మృతి చెందారు. పీఎల్‌జీఏ నంబర్ 1 బెటాలియన్‌కు చెందిన శాంతి, హంగి, సింట్‌గా గుర్తించారు. కాగా, గుట్టలను 20వేలకుపైగా కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. తనిఖీల్లో అడుగడుగునా బీరు సీసాల్లో మందుపాతరలు అమర్చినట్లు గుర్తించారు. కాగా, మరోసారి శాంతి చర్చలు జరపాలంటూ మావోయిస్టులు కోరుతున్నారు. ఈ మేరకు బేషరతుగా శాంతిచర్చలు జరపాలని ప్రతిపాదన పంపినట్లు సమాచారం.