Published On:

Hyderabad: మదీనాగూడలో ఫేక్ డాక్టర్, పట్టుకున్న విజిలెన్స్!

Hyderabad: మదీనాగూడలో ఫేక్ డాక్టర్, పట్టుకున్న విజిలెన్స్!

Hyderabad: మదీనాగూడలోని అంకురా హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న ఫేక్ డాక్టర్ ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ బృందం గుర్తించింది. కలపాల భరత్ కుమార్ అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా మదీనగూడలోని అంకురా హాస్పిటల్లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఎంబీబీఎస్ ఫెయిల్ అయి ఫేక్ సర్టిఫికెట్స్ తో అంకురా హాస్పిటల్ లో పిడియాట్రిక్ డాక్టర్ గా సేవలు అందిస్తూనే.. డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. భైరం భరత్ కుమార్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ నెంబర్ ను కలపాల భరత్ కుమార్ ఉపయోగించుకొని అంకుర హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్ విష్ణు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీల్లో అంకురా హాస్పిటల్ బాగోతం బయటపడపడింది. దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఇతను ప్రాక్టీస్ చేస్తున్నాడు.

మదీనాగూడలో ఫేక్ డాక్టర్, పట్టుకున్న విజిలెన్స్- వీడియో

 

కొందరు డాక్టర్ల పేరుతో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అసలు డిగ్రీ కూడా ఫాస్ కాకుండా డాక్టర్ల అవతామ మెత్తుతున్నారు. కొందరు ఆర్ఎంపీ బోర్డులతో వైద్యం చేస్తూ లక్షలు దండుకుంటున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లోనే నకిలీ డాక్టర్లు ఉన్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. కమిషన్ బేస్డ్ గా కొందరు రోగులను వాళ్లకు అనుగునంగా ఉండే హాస్పిటల్లకు పంపుతున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి వారిపై చర్యలు కఠినతరం చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.