Last Updated:

CPI Narayana: రేపు రామగుండం బంద్- సీపీఐ నారాయణ

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11,12 తేదీల్లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు సహా పలువురు ఉద్యమకారులు బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే మోదీ గో బ్యాక్ అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు పిలుపునిచ్చారు

CPI Narayana: రేపు రామగుండం బంద్- సీపీఐ నారాయణ

CPI Narayana: తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11,12 తేదీల్లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు సహా పలువురు ఉద్యమకారులు బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే మోదీ గో బ్యాక్ అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 11న మోడీ విశాఖలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా 12వ తేదీన తెలంగాణలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు వస్తున్న పీఎం మోదీకి 8 డిమాండ్లతో తెలంగాణ మేధావులు బహిరంగ లేఖను విడుదల చేశారు. విభజన చట్టంలో హామీలను నెరవేర్చాలని, తెలంగాణ పట్ల వివక్ష పూరిత ధోరణి విడనాడాలని, మతతత్వ ధోరణి వీడి, దేశ ఐక్యతను కాపాడేలా పరిపాలన సాగించాలని వారు డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసిన మోదీ వైజాగ్ కు ఎందుకు వస్తున్నారని కార్మికులు, విప‌క్ష నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణకు ఏమీ చేయని మోదీ రామగుండంకు ఎందుకు వస్తున్నారని నిల‌దీస్తున్నారు. విశాఖ, రామగుండంలలో మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పలుకుతామని తమతోపాటు నిరసనకి ఏపార్టీలు వచ్చినా కలుపుకుపోతామని సీపీఐ నేత నారాయణ వెల్ల‌డించారు. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: ఈ నెల 19, 20ల్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్

ఇవి కూడా చదవండి: