Home / PM Modi
Arvind Kejriwal challenges Pm Modi: ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్టీఏ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందిస్తే.. తాను బీజేపీ కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉచిత విద్యుత్ అమలు […]
ఇకపై ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్'గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలత కూడిన వినతిపత్రాన్ని సమర్పించి తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రధానిని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయి అరగంటపాటు చర్చించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం మద్దతును కోరారు
బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూఆటోపైలట్, రిమోట్పైలట్తో ప్రభుత్వాన్ని నడిపే వారు కూడా ఉన్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై విమర్శలు ఎక్కు పెట్టారు
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ తన దైన శైలిలో సెటైర్లు వేసారు. మంగళవారం లోక్ సభలో ప్రసంగిస్తూ 'షోలే' సినిమాలో డైలాగ్ ను ఉదహరిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసారు.పార్లమెంటు ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి తాను ఏదో సాధించానన్న భావనలో కాంగ్రెస్ ఉందని అన్నారు.
18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ సభ్యునిగా మోదీ ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి.వరుసగా మూడవసారి ఎన్డీఏ కూటమి గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టిన విషయం తెలిసందే. ఈ నేపధ్యంలో మోదీ, మంత్రులు ఈ నెల జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసారు.
ఇటలీలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో సమావేశమయ్యారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిశారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన సమయంలో గొప్ప ఆసక్తి కర సంఘటన జరిగింది . మంత్రులు ప్రమాణస్వీకారం అనంతరం వెళ్లి పోతున్న మోదీ వెనుదిరిగి పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదిక దగ్గరు వెళ్లారు.
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చారు. వచ్చి రాగనే పీఎం కిసాన్నిధి 17వ ఇన్స్టాల్మెంట్ ఫైల్‌పై సంతకం చేశారు.