Published On:

Yadagirigutta: రాష్ట్రంలో కలకలం.. యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపు.. అందగత్తెలు వస్తున్నారనే!

Yadagirigutta: రాష్ట్రంలో కలకలం.. యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపు.. అందగత్తెలు వస్తున్నారనే!

Bomb Threat Call to Yadagirigutta Temple while Miss World Contestants visiting Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు బాంబు బెదిరింపు వచ్చింది. ఆలయంలోని కల్యాణకట్ట సమీపంలో శ్రీలక్ష్మి పుష్కరిణి దగ్గర బాంబు పెట్టారని ఓ దుండగుడు 100కు కాల్‌‌‌‌ చేసి చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత డాగ్‌‌‌‌, బాంబ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌తో పుష్కరిణి సమీపంలో తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి బాంబు కనిపించలేదు. దీంతో అధికారులతో పాటు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

 

కాగా, యాదగిరిగుట్టలో ఇవాళ మిస్‌‌‌‌ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటన ఉంది. అయితే ఎవరో కావాలనే 100కు ఫేక్‌‌‌‌ కాల్‌‌‌‌ చేసి ఉంటారని పోలీసులు నిర్ధారించారు. కాగా, ఫోన్‌‌‌‌ చేసిన నంబర్‌‌‌‌కు తిరిగి కాల్‌‌‌‌ చేస్తే స్విచాఫ్‌‌‌‌ వస్తోందని..ఆ వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు చెప్పారు.

 

ఇదిలా ఉండగా, గత కొన్ని రోజులుగా తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు మిస్ వరల్డ్ బ్యూటీస్ నేడు రెండు ప్రాంతాలను సందర్శించనున్నారు. ఒక టీం క్షేత్ర పర్యటనలో టూరిజం విలేజ్ పోచంపల్లి వెళ్లనుంది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామాన్ని సందర్శించనున్నారు.

 

పోచంపల్లి.. పట్టుచీరల నేతలో ప్రపంచ ఖ్యాతి పొందిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సుందరీమణులు నేతన్నలతో మాట్లాడి చీరలు నేచే విధానం తెలుసుకోనున్నారు. అనంతరం పోచంపల్లి వీధుల్లో పర్యటన, మ్యూజియం సందర్శన, స్థానికులతో మాటామంతీ ఉండనుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి భూదాన్ పోచంపల్లి ప్రస్థానం, హ్యాండ్లూమ్‌పై ప్రత్యేక వీడియో ప్రదర్శన ఉంటుంది.

 

ఇక, రెండవ టీం విషయానికొస్తే..యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించనున్నారు. కరేబియస్ దీవులకు చెందిన 10 దేశాల ప్రతినిధులతో పాటు అందగత్తెలు సందర్శించనున్నారు. ఈ మేరకు కోలాటం, బంజారా నృత్యాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రత్యేక అధికారి కిషన్ రావు నేతృత్వంలో ఆహ్వానం పలకనున్నారు. ఇందులో భాగంగానే సాయంత్రం 5 గంటల నుంచియాదగిరిగుట్ట ఆలయం, విశిష్టత, చారిత్మక నేపథ్యంపై ప్రత్యేక ప్రదర్శన, ఆలయ సందర్శన, ప్రత్యేక పూజలు, ఆశీర్వచనం, గ్రూప్ ఫోట్ సెషన్ ఉండనుంది.