Published On:

Ration Card: కేంద్రం కీలక నిర్ణయం.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీకి సిద్ధం!

Ration Card: కేంద్రం కీలక నిర్ణయం.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీకి సిద్ధం!

Central Government Good News For States Giving Three Months Ration in Advance: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు దారులకు ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ అందించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రానున్న 3 నెలలు వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా అర్హత ఉన్న రేషన్ లబ్ధిదారులకు బియ్యంతో పాటు ఇతర సామగ్రిని అందించనుంది. అయితే, అర్హత ఉన్న రేషన్ లబ్ధిదారులకు మాత్రమే 3 నెలల రేషన్ బియ్యంను అందించనున్నారు.

 

కాగా, మే చివరి వరకు రేషన్ లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈకేవైసీ పూర్తిచేస్తేనే మే చివరి వరకు రేషన్ పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోట్లమందికి లబ్ధి చేకూరనుంది. గతంలో వర్షా కాలంలో రేషన్ తీసుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. తాజాగా, ముందస్తుగానే ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, తెలంగాణలో మాత్రం జూన్‌లో పంపిణీ చేయనున్నట్లు సమాచారం.

 

ఇందులో భాగంగా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. సంబంధింత రాష్ట్రాలు కేటాయించిన నిల్వలను లిఫ్ట్ చేసుకొని మే చివరి వరకు లబ్ధిదారులకు ఒకేసారి 3 నెలల రేషన్ అందజేయాలని చెప్పింది. కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రేషన్ అందించే ప్రక్రియ ఊపందుకుంది.

 

మరోవైపు, ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీపై పలు ఆరోపణలు చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా 3 నెలల రేషన్ ఒకేసారి చేయలేదు. కానీ భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పంపిణీ చేస్తుందని ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య యుద్ధ సూచనలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. ఈ అనుమానాలను పక్కనబెడితే.. 3 నెలల రేషన్ ఒకేసారి పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని కేంద్రం సూచించింది.