Realme GT 7 Series Launch: 7,000mAh బ్యాటరీతో రియల్‌మీ కొత్త ఫోన్లు.. ఊపు ఊపేస్తుంది..!

Realme GT 7 Series Launching on May 27th: రియల్‌మీ తన శక్తివంతమైన రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Realme GT 7, Realme GT 7T లను ప్రపంచ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు ఫోన్లు మే 27న ప్రపంచ మార్కెట్‌ను షేక్ చేయనున్నాయి. బ్రాండ్ ప్రకారం.. ఈ రెండు ఫోన్‌లను “ఫ్లాగ్‌షిప్ కిల్లర్స్”గా అభివర్ణిస్తున్నారు, ఇవి పనితీరుపై దృష్టి సారిస్తాయి. ఈ బ్రాండ్ ఇప్పటికే రెండు ఫోన్‌ల డిజైన్‌ను వెల్లడించింది. ఇప్పుడు వినియోగదారుల ఉత్సాహ స్థాయిని పెంచడానికి, కంపెనీ హ్యాండ్‌సెట్ బ్యాటరీ పరిమాణం, ఛార్జింగ్ సామర్థ్యాన్ని కూడా వెల్లడించింది.
బ్రాండ్ కొత్త ప్రోమో పోస్టర్‌ను షేర్ చేసింది. రాబోయే GT 7, GT 7T స్మార్ట్‌ఫోన్‌లు రెండూ పెద్ద 7,000mAh బ్యాటరీతో వస్తాయన వెల్లడించింది. దీనితో పాటు, ఈ రెండు ఫోన్‌లు 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తాయి. అయితే, ఇతర స్పెసిఫికేషన్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫోన్ చాలా ఫీచర్లు లీకైన నివేదికలలో వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Realme GT 7 Series Launch Date
రియల్‌మీ కొత్త GT 7,GT 7T ఫోన్‌లను మే 27న పారిస్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు భారత కాలమానం ప్రకారం విడుదల చేయనుంది. లాంచ్ తర్వాత, ఈ హ్యాండ్‌సెట్ భారతదేశంతో సహా ఇతర ప్రపంచ మార్కెట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం, రెండు ఫోన్‌ల ధరకు సంబంధించిన సమాచారం వెల్లడించలేదు. కానీ ఫోన్ ధర కూడా త్వరలో ప్రకటిస్తారని భావిస్తున్నారు.
Realme GT 7 Features
కొత్త సమాచారం ప్రకారం.. GT 7, GT 7T స్మార్ట్‌ఫోన్‌లు రెండూ పెద్ద 7,000mAh బ్యాటరీతో ఉంటాయి. దీనితో పాటు, ఈ రెండు ఫోన్‌లు 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తాయి. అదే సమయంలో, ఇటీవలి వారాల్లో గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో Realme GT 7, GT 7T కూడా కనిపించాయి. ఈ జాబితా GT 7 రాబోయే డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌తో రావచ్చని సూచిస్తుంది, అయితే 7T డైమెన్సిటీ 8400 ద్వారా శక్తిని పొందవచ్చని సూచిస్తుంది.
నివేదిక ప్రకారం, రెండు మోడళ్లలో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో 6.78-అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే ఉండవచ్చు. ఈ ఫోన్లు 12GB వరకు RAM,512GB వరకు స్టోరేజ్‌తో అందుబాటులో ఉండవచ్చు. ఈ రెండు ఫోన్లు రియల్‌మీ UI 15 తో ఆండ్రాయిడ్ 6 రన్ అవుతుందని భావిస్తున్నారు.
ఫోటోగ్రఫీ కోసం, Realme GT 7 లో 50MP OIS మెయిన్ లెన్స్, 8Mp అల్ట్రా-వైడ్,50MP టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండచ్చు. GT 7Tలో OISతో 50MP + 8MP డ్యూయల్-కెమెరా సిస్టమ్ ఉండచ్చు. రెండు ఫోన్‌లలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. GT 7T ఎల్లో, బ్లూ, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది అయితే GT 7 బ్లాక్, బ్లూ రంగులలో లభిస్తుంది.