Published On:

KTR : తెలంగాణలో భారీ కుంభకోణం..రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR : తెలంగాణలో భారీ కుంభకోణం..రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

BRS Working President KTR : రేవంత్‌రెడ్డి హయాంలో అధికారులు జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇవాళ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రేవంత్‌రెడ్డి వ్యవహారంతో అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించిందని ఆమె గుర్తుచేశారు. కంచ గచ్చిబౌలి భూమిని అమ్మడానికి రూ.10వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. పచ్చదనాన్ని నాశనం చేయటానికి బుల్డోజర్లను మోహరించడం పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కారు సుప్రీం తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రేవంత్‌ సర్కారు అనాలోచిత చర్యలతో పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదం ఉందన్నారు. కంచ గచ్చిబౌలి అడవులను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. హెచ్‌సీయూ వ్యవహారంలో జరిగిన తప్పిదాలకు రేవంత్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

 

రేవంత్‌రెడ్డికి దేవుని పట్ల భక్తి లేదు : గొంగిడి సునీత
తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు దెబ్బతీసిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆరోపించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మహిళలతో ప్రపంచ సుందరీమణుల కాళ్లు కడిగిస్తారా అని ప్రశ్నించారు. వరంగల్‌కు చెందిన ఇద్దరు మహిళా మంత్రులతో కాళ్లు కడిగించి ఉంటే బాగుండేదన్నారు. రాణి రుద్రమదేవి, సమ్మక్క, సారలమ్మ అస్తిత్వాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు దెబ్బతీసేలా చేసిందని మండిపడ్డారు.

 

బతుకమ్మను చెప్పులతో ఆడిస్తారా అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చూస్తుంటే భస్మాసుర హస్తం గుర్తుకు వస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. రేవంత్‌కు మనుషుల పట్ల గౌరవం లేదని, దేవుని పట్ల భక్తి లేదని ఆరోపించారు. సీఎంకు ఇంత అహంకారం ఎందుకని నిలదీశారు. ఇంత జరిగినా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు మధ్య ఏం అవగాహన ఒప్పందం ఉందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి: