Miss World : యాదగిరిగుట్టలో అందాల భామలు

Miss World : ప్రపంచ సుందరీమణులు ఇవాళ సాయంత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గెస్ట్‌హౌస్ నుంచి బ్యాటరీ వాహనాల్లో చేరుకొని అఖండ దీపారాధన మండపంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందాల భామల వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులు, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆలయ ఏఈవో భాస్కర్ తదితరులు ఉన్నారు. అక్టోపస్, తెలంగాణ స్పెషల్ పోలీసులు, ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది భద్రతను పర్యవేక్షించారు.
పోచంపల్లిలో ప్రపంచ సుందరీమణులు..
టూరిజం విలేజ్‌గా గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లిని ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల ప్రపంచ పోటీదారులు సందర్శించారు. వారికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇక్కత్ చీరల ప్రత్యేకత, తయారీ విధానాన్ని విదేశీ అతిథులు పరిశీలించారు. పలువురు అందాల భామలు స్వయంగా చీరలను నేసి సంబురపడ్డారు.