Home / CPI Narayana
రాష్ట్రం రావణకాష్ఠంలాగా మారుతుంటే ఇరుపార్టీల అగ్రనేతలు విదేశీ పర్యటనలు చేయడం ఏంటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు .సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు
గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప.. ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక పోతే.. కొడతారా?.. స్పీకర్, ముఖ్యమంత్రి ఇద్దరిదీ ఈ ఘటనలో తప్పు ఉంది. స్పీకర్ , సీఎం జగన్ ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలి.
విశాఖలో రిషికొండను రేప్ చేస్తున్నారని ప్రకృతిని రేప్ చేసిన పాపం ఊరికేపోదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ శుక్రవారం రుషికొండ చేరుకుని అక్కడ తవ్వకాలను పరిశీలిస్తున్నారు.
సుమారు రూ.300 కోట్ల అవకతవకలు జరిగి అక్రమాల పుట్టగా మారిన చిత్రపురి హోసింగ్ సొసైటీ పై సీబీఐ విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ డిమాండ్ చేసారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11,12 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు సహా పలువురు ఉద్యమకారులు బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే మోదీ గో బ్యాక్ అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు పిలుపునిచ్చారు
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం చదివిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. యూనివర్శిటీ బిల్లులను ఆపే హక్కు గవర్నర్ కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
ఫ్లోరిడాలో కమ్యూనిస్ట్ నేత సీపీఐ కార్యదర్శి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మియామి విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకొనింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ పేరుతో ఆయన్ను మూడు గంటల పాటు వేధించారు.
రైతు మోటార్లకు మీటర్లు బిగిస్తే బిగించేవాడి చేతులు నరకుతామంటూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో రైతు సదస్సులో పాల్గొన్న ఆయన రాజన్న పాలన తెస్తానని రాజన్న మాటకి సీఎం జగన్ పంగ నామాలు పెట్టారని మండిపడ్డారు.
గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటారని సీపీఐ నారాయణ అన్నారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను గవర్నర్ ఎందుకు వ్యతిరేకించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ పదవే పనికిమాలినదని విమర్శించారు. బీజేపీ నాయకులను గవర్నర్‌ను చేస్తే ఇలానే ఉంటుందన్నారు.