Published On:

Metro: మెట్రో ప్రయాణికులకు ఝలక్.. రేపటి నుంచి ఛార్జీల పెంపు

Metro: మెట్రో ప్రయాణికులకు ఝలక్.. రేపటి నుంచి ఛార్జీల పెంపు

Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ ఝలక్ ఇచ్చింది. నగరంలో ఎంతో మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో సేవలందిస్తోంది. నగరంలోని మూడు రూట్లలో మెట్రో పరుగులు తీస్తోంది. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం, ఎంజీబీఎస్- జేబీఎస్ మధ్య మెట్రో రాకపోకలు సాగిస్తోంది. ఈనేపథ్యంలోనే తాజాగా మెట్రో ఛార్జీలను పెంచుతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమలవుతాయని తెలిపింది. కాగా మెట్రో రైలులో ఇప్పటి వరకు ఉన్న కనీస ఛార్జి రూ. 10 నుంచి రూ. 12కు పెంచింది. అలాగే గరిష్ట టికెట్ ఛార్జి రూ. 60 నుంచి రూ. 75కు పెంచింది.

మొదటి 2 కి.మీ. వరకు రూ. 12

2 కి.మీ. నుంచి 4 కి.మీ. వరకు రూ. 18

4 కి.మీ. నుంచి 6 కి.మీ. వరకు రూ. 30

6 కి.మీ. నుంచి 9 కి.మీ. వరకు రూ. 40

9 కి.మీ. నుంచి 12 కి.మీ. వరకు రూ. 50

12 కి.మీ. నుంచి 15 కి.మీ. వరకు రూ. 55

15 కి.మీ. నుంచి 18 కి.మీ. వరకు రూ. 60

18 కి.మీ. నుంచి 21 కి.మీ. వరకు రూ. 66

21 కి.మీ. నుంచి 24 కి.మీ. వరకు రూ. 70

24 కి.మీ. వరకు, అంతకు మించి దూరానికి రూ. 75 ఛార్జి వసూలు చేయనున్నారు. మెట్రో ఛార్జిల పెంపుతో ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం పడనుంది.