Last Updated:

Oscars 95: ఆస్కార్ వేదికపై నాటు నాటు పర్ఫార్మెన్స్.. వీడియో కోసం ఇక్కడ చూడండి

Oscars 95: ఆస్కార్ వేదికగా.. నాటు నాటు సాంగ్ ఫర్మార్మెన్స్ అదిరిపోయింది. ఈ వేడుక నాటు నాటు సాంగ్ తో ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ 95వ ఆస్కార్ వేడుకలు జరుగుతున్నాయి. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను నిర్వహిస్తారు.

Oscars 95: ఆస్కార్ వేదికపై నాటు నాటు పర్ఫార్మెన్స్.. వీడియో కోసం ఇక్కడ చూడండి

Oscars 95: అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ అవార్డు వేడుకకు సినీ తారలు హాజరయ్యారు. ఇక ఈ వేడుక తెలుగు సాంగ్ ‘నాటు నాటు’తో ప్రారంభం అయ్యింది.

అదిరిపోయిన ఫర్మార్మెన్స్.. (Oscars 95)

ఆస్కార్ వేదికగా.. నాటు నాటు సాంగ్ ఫర్మార్మెన్స్ అదిరిపోయింది. ఈ వేడుక నాటు నాటు సాంగ్ తో ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ 95వ ఆస్కార్ వేడుకలు జరుగుతున్నాయి. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి తారలు తరలివచ్చారు. ఇక RRR మూవీ నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ.. మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ మన తెలుగు సాంగ్ నాటు నాటు తో ప్రారంభం అయ్యింది.

పాటను పరిచయం చేసిన దీపిక పదుకొణె..

ఈ ఆస్కార్ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీతారలు హాజరయ్యారు. అమెలికాలోని లాస్ ఎంజెల్స్ లో ఈ వేడుక అట్టహాసంగా సాగుతోంది. ఇప్పటికే పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ప్రకటించారు.ఆస్కార్ అవార్డుల వేడుకలో బాలీవుడ్ కథనాయిక దీపిక పదుకొణె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ని ఆమె ఆస్కార్ వేడుకలో పరిచయం చేశారు. ఆ పాట నేపథ్యాన్ని ఈ వేడుకకు హాజరైన వారికి వివరించారు. ఈ వేడుకకుప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఎంఎం కీరవాణి స్వరాలు అందించిన ఈ సాంగ్ ప్రపంచం మొత్తాన్ని ఓ ఊపు ఊపింది. ఇక ఈ పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన స్టెప్పులు వేరే లేవల్ అంతే. ఇక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా నేడు ఆస్కార్ ఈవెంట్ ని మొదలు పెడుతూ హోస్ట్ గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్ ఆస్కార్ గురించి మాట్లాడిన తరువాత ప్రోగ్రామ్ మొదలయ్యే ముందు స్టేజి పై మరికొందరు డాన్సర్స్ నాటు నాటు స్టెప్పు వేశాడు. దీంతో నాటు నాటు తో ఆస్కార్ వేడుక మొదలైంది. కాగా ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుక ఒక తెలుగు పాటతో మొదలు కావడంతో తెలుగు ఆడియన్స్.. తెలుగు వాళ్ళకి ఇంతటి గౌరవం కలిగించినందుకు రాజమౌళి మరియు మూవీ టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక ఈ పాట ఆస్కార్ గెలవడం ఒక్కటే మిగిలి ఉంది.