Jr NTR Wishes to Allu Arjun: హ్యాపీ బర్త్‌డే బావ.. ఎన్టీఆర్ బర్త్‌డే విషెస్‌కి అల్లు అర్జున్ రిప్లై చూశారా..?

Jr NTR Birthday Wishes to Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బర్త్‌డే నేడు. ఏప్రిల్ 8న బన్నీ 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా అతడికి సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం బన్నీ బర్త్‌డే సందడే కనిపిస్తుంది. ఇక ఆయన కొత్త సినిమాల నుంచి ఆఫీషియల్ అప్‌డేట్స్ వస్తుండటంతో అభిమానుల సంబరాలు మరింత రెట్టింపు అయ్యాయి.
నీతో నడవడం గర్వంగా ఉంది: స్నేహ రెడ్డి..
ఇక బన్నీకి ఆయన సతీమణి స్నేహా రెడ్డి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ మేరకు వీడియో షేర్ చేస్తూ.. నా జీవితంలో ప్రేమను పంచిన నీకు 43వ పుట్టిన రోజు శుభకాంక్షలు. ఈ జీవితంలో నీతో కలిసి నడుస్తున్నందుకు నాకేంతో గర్వంగా ఉంది. ఈ ఏడాంత నువ్వు సంతోషంగా, ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా” అంటూ భర్తకు క్యూట్ విషెస్ తెలిపింది. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా బన్నీకి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఇందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి. బావ అంటూ బన్నీని పిలవడం చూసి అభిమానులంతా మురిసిపోతున్నారు.
హ్యాపీ బర్త్ డే బావ..
ఈ మేరకు తారక్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “పుట్టిన రోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్ బావ. ఈ ఏడాది నీకు మరింత శక్తి, ప్రేమతో పాటు మరెన్నో మైల్‌స్టోన్స్ తీసుకురావాలని ఆశిస్తున్నా” అంటూ ఎన్టీఆర్ రాసుకోచ్చాడు. తారక్ పోస్ట్‌కి బన్నీ స్పందించాడు. “బావ నీ లవ్వీ విషెస్‌కి థ్యాంక్స్. నీకు మరింత శక్తి, ప్రేమ కలగాలి” అంటూ రిప్లై ఇచ్చాడు. ఇలా ఇద్దరు ఒకరినొకరు బావ అని అప్యాయంగా పిలుచుకోవడం, ఒకరి విజయాన్ని మరోకరు ఆకాంక్షించుకోవడం చూసి అల్లు-నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్స్ ఎక్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిపై ఫ్యాన్స్, నెటిజన్స్ తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, అల్లు అర్జున్ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Many happy returns of the day Bava @alluarjun… May this year bring you more power, love, and milestones…
— Jr NTR (@tarak9999) April 8, 2025
కాగా ఇండస్ట్రీలో బన్నీ-తారక్‌లు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఒకరికి ఒకరు విషెస్ చెపుకుంటుంటారు. బావ అని పిలుచుకుంటు తమ మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకుంటుంటారు. ఇది ఇద్దరి హీరోల ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తారక్ బన్నీకి విష్ చేశాడు. అయితే ఈసారి ప్రత్యేకంగా శక్తి, ప్రేమతో పాటు తన జీవితంలో ఎన్నో మైల్ స్టోన్స్ రావాలని కోరుకుంటున్నానంటూ ఆకాంక్షించడం విశేషం. అలాగే బన్నీ కూడా రిప్లై ఇస్తూ నీకు మరింత ప్రేమ, శక్తి కలగాలని కోరుకుంటున్నా అనడం ప్రత్యేకంగా నిలిచింది. ఇద్దరు స్టార్ హీరోలైన గర్వం లేకుండ ఒకరి సక్సెస్‌ని మరొకరు ఆకాంక్షించుకోవడం వారి నిజమైన వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ మూవీతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ చిత్రంతో ఇటీవల షూటింగ్‌ని కూడా మొదలుపెట్టాడు. మరోవైపు అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ మూవీ కోసం సన్నద్ధం అవుతున్నాడు. నేడు బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే.
Bava.. Thank you so much for your lovely wishes. More love and power to you.
— Allu Arjun (@alluarjun) April 8, 2025